తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పదో తరగతి అర్హతతో బ్యాంక్ జాబ్స్​- అప్లైకు లాస్ట్​ డేట్​ ఎప్పుడంటే? - Bank Jobs On 10th Class

Central Bank Jobs 2023 : సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో సబ్​-స్టాఫ్​ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. మరి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సిన విద్యార్హతలు, దరఖాస్తు చివరితేదీ, వయో పరిమితి తదితర వివరాలు మీకోసం.

Latest Bank Jobs December 2023
Central Bank Of India Jobs 2023

By ETV Bharat Telugu Team

Published : Dec 22, 2023, 12:16 PM IST

Central Bank Jobs 2023 :కేవలం పదో తరగతి అర్హతతో ప్రభుత్వ బ్యాంకులో ఉద్యోగం సంపాదించాలనుకునేవారికి సువర్ణవకాశాన్ని కల్పించింది సెంట్రల్​ బ్యాంక్ ఆఫ్​ ఇండియా (CBI Recruitment 2023). దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 484 సబ్​-స్టాఫ్​ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హత ఉండి ఆసక్తిగల అభ్యర్థులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టు వివరాలు
Central Bank Of India Jobs 2023 Vacancy : సబ్​-స్టాఫ్​(సఫాయి కర్మఛారీ)- 484 పోస్టులు

విద్యార్హతలు
Central Bank Of India Jobs Qualification :పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించిన వారు పైపోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఏజ్​ లిమిట్​
Central Bank Of India Jobs Age Limit :సబ్​-స్టాఫ్​కు అప్లై చేసుకునే అభ్యర్థుల వయసు 2023 మార్చి 31 నాటికి 18 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు రుసుము(Central Bank Of India Jobs Application Fees)

  • ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు- రూ.175
  • మిగతా అభ్యర్థులకు- రూ.850

ఎంపిక ప్రక్రియ(Central Bank Of India Jobs 2023 Selection Process)

  • రాత పరీక్ష- 70 మార్కులు
  • స్థానిక భాషపై పరీక్ష(లోకల్​ లాంగ్వేజ్​ టెస్ట్​)- 30 మార్కులు
  • డాక్యుమెంట్​ వెరిఫికేషన్
  • మెడికల్​ ఎగ్జామినేషన్

పరీక్షా విధానం(Central Bank Of India Jobs 2023 Exam Pattern)

  • పరీక్ష సమయం : 90 నిమిషాలు
  • రాత పరీక్ష : కంప్యూటర్​ బేస్డ్​ టెస్ట్​
  • ఎటువంటి నెగెటివ్​ మార్కింగ్​ లేదు
  • ఇంగ్లిష్​ భాషలో ప్రశ్నాపత్రం ఉంటుంది.

Central Bank of India Sub-Staff Vacancy 2023 :రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వారీగా పోస్టుల వివరాలు.

జోన్ రాష్ట్రం పోస్టుల సంఖ్య
అహ్మదాబాద్ గుజరాత్ 76
భోపాల్​ మధ్యప్రదేశ్​ 24
భోపాల్​ ఛత్తీస్​గఢ్​​ 14
దిల్లీ దిల్లీ 21
దిల్లీ రాజస్థాన్ 55
కోలకతా ఒడిశా 02
లఖ్​నవూ ఉత్తర్​ప్రదేశ్​ 78
MMZO అండ్​ పుణె మహారాష్ట్ర 118
పట్నా బిహార్ 76
పట్నా ఝార్ఖండ్ 20

పరీక్ష తేదీ
Central Bank Of India Jobs 2023 Exam Date :2024 ఫిబ్రవరిలో పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది.

ముఖ్యమైన తేదీలు(Central Bank Of India Jobs 2023 Important Dates)

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ : 2023 డిసెంబర్​ 20
  • దరఖాస్తుకు ఆఖరి గడువు : 2024 జనవరి 9

అధికారిక వెబ్​సైట్​
Central Bank Of India Official Website :పరీక్ష సిలబస్​ సహా నోటిఫికేషన్​కు సంబంధించి మరిన్ని వివరాల కోసం సెంట్రల్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా అధికారిక వెబ్​సైట్ www.centralbankofindia.co.inను చూడవచ్చు.

డిగ్రీ అర్హతతో DRDOలో 102 ఉద్యోగాలు ​- అప్లై చేసుకోండిలా!

ఇండియన్​ నేవీలో 910​ ఉద్యోగాలు​ - దరఖాస్తుకు మరో 11 రోజులే ఛాన్స్​!

ABOUT THE AUTHOR

...view details