తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రక్తం గడ్డకట్టిన దాఖలాలు ఉన్నాయా..! - రక్తం గడ్డ కట్టడం

కరోనా టీకా తీసుకున్న వారిలో రక్తం గడ్డకట్టిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అనే విషయంపై కేంద్రం దృష్టి సారించింది. ఇతర దేశాల్లో ఈ తరహా ఘటనలు వెలుగు చేసిన నేపథ్యంలో దీనిపై ఓ నిపుణుల బృందంతో దర్యాప్తు చేయిస్తోంది.

center-panel-probing-vaccine-linked-clotting
రక్తం గడ్డకట్టిన దాఖలాలు ఉన్నాయా..!

By

Published : Apr 10, 2021, 5:43 AM IST

ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో కరోనా టీకా తీసుకున్న వారిలో రక్తం గడ్డ కడుతున్న కేసులు వెలుగు చూస్తున్నందున కేంద్రప్రభుత్వం వాటిపై దృష్టి సారించింది. దేశంలో ఇప్పటికే రెండు టీకాల పంపిణీ జరుగుతోంది. ఎక్కడైనా ఈ తరహా కేసులు ఏమైనా నమోదయ్యాయా అని నిపుణుల బృందం దర్యాప్తు చేస్తోంది. నేషనల్ అడ్వర్స్‌ ఈవెంట్స్ ఫాలోయింగ్ ఇమ్యూనైజేషన్ (ఏఈఎఫ్ఐ)కి చెందిన సభ్యుడు ఎన్‌కే అరోరా దీనిపై మాట్లాడారు. 'దర్యాప్తు జరుగుతోన్న మాట వాస్తవం. ప్రతి టీకాకు ఈ తరహా సమీక్ష ఉంటుంది. గతంలోనూ ఇలాంటివి చేశారు. ఇందులో కొత్తేం లేదు' అని ఆయన చెప్పారు. దీనికి సంబంధించి ఓ నివేదికను వచ్చేవారం కేంద్రానికి సమర్పిస్తామని తెలిపారు. ఆస్ట్రాజెనికా టీకా తీసుకున్నవారిలో రక్తం గడ్డకట్టిన దాఖలాలను ఐరోపా ఔషధ నియంత్రణ సంస్థ గుర్తించిన నేపథ్యంలో ఈ నివేదిక రానుంది. గతంలో సమర్పించిన నివేదికలో ఇలాంటి కేసులేవీ నమోదు కాలేదు.

కరోనా టీకా కార్యక్రమం కింద భారత్‌లో కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలను అందిస్తోన్న సంగతి తెలిసిందే. దేశంలో వైరస్ తీవ్రమవుత వేళ.. అందరూ తప్పక టీకా తీసుకోవాలని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను కోరుతున్నాయి. అలాగే టీకా కార్యక్రమ పరిధిని విస్తృతం చేయాలని కేంద్రానికి డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

ఇదీ చూడండి:కొవిడ్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం- నలుగురు మృతి

ABOUT THE AUTHOR

...view details