కేంద్ర ప్రభుత్వం మరో 66 కోట్ల కొవిషీల్డ్ వ్యాక్సిన్ల(Covishield Vaccine) కొనుగోలు కోసం ఆర్డర్లు పంపించింది. డిసెంబరు నాటికి వీటిని అందజేయాలని తయారీదారులైన పుణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాను (ఎస్‌ఐఐ) కోరింది. ప్రస్తుత నెలలో ఆ సంస్థ 20.29 కోట్ల డోసులను సరఫరా చేయగలుగుతుందని ఎస్‌ఐఐ వద్ద ప్రభుత్వ నియంత్రణ అధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ప్రకాశ్ కుమార్ సింగ్ సమాచారం ఇవ్వడంతో తదనంతర చర్యగా కొత్త ఆర్డర్లు ఇచ్చింది.
- ఐదు కోట్ల డోసుల కొవాగ్జిన్ వ్యాక్సిన్(Covaxin vaccine) కావాలని కేంద్ర ఆరోగ్య శాఖ మార్చి 12న భారత్ బయోటెక్‌కు ఆర్డర్లు ఇవ్వగా వాటి సరఫరా దాదాపుగా పూర్తికావొస్తోంది. మరో 28.50 కోట్లు కావాలంటూ జులైలో ఇంకో ఆర్డరు ఇచ్చింది.