కరోనా మహమ్మారిని మరింత సమర్థంగా ఎదుర్కొనేందుకు వీలుగా విదేశాల నుంచి సాయాన్ని రాష్ట్రాలు నేరుగా అందుకునే వెసులుబాటు కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. ఉచిత పంపిణీ నిమిత్తం.. కొనుగోలు రూపంలో, లేదా విరాళాల ద్వారా సామగ్రిని సమీకరించుకొనేందుకు ఒక నోడల్ అధికారిని మాత్రం రాష్ట్రాలు నియమించుకోవాల్సి ఉంటుంది. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు మన దేశంలోని విదేశీ రాయబార కార్యాలయాలను సంప్రదించి నేరుగా కరోనా సంబంధిత సామగ్రి సమీకరణకు వివరాలు తెలుసుకోవచ్చు. వీటిపై కస్టమ్స్ సుంకం, ఐజీఎస్టీ వంటి వాటి నుంచి మినహాయింపులు పొందేందుకు వీలుంది. నిరభ్యంతర ధ్రువీకరణ పత్రాలు తీసుకోవాల్సిన పనిలేదు.
నాలుగు జాతీయ సర్వేల నిలుపుదల