విద్యా సంస్థల్లో, ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్జెండర్లకు రిజర్వేషన్లు కల్పించడంపై కేంద్రం కసరత్తు చేస్తోంది. ఈ విషయంలో సుప్రీం కోర్టు 2014లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే. దానిని అమలు చేసే దిశగా ప్రభుత్వం చర్యలకు శ్రీకారం చుట్టింది.
ట్రాన్స్జెండర్లకు రిజర్వేషన్‌పై కేంద్రం కసరత్తు - ట్రాన్స్జెండర్లు
ట్రాన్స్జెండర్లకు విద్యా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేష్లను కల్పించటంపై కసరత్తు చేస్తోంది కేంద్రం. 2014లో సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు సేసే దిశగా చర్యలకు శ్రీకారం చుట్టింది.
ట్రాన్స్జెండర్లకు రిజర్వేషన్‌పై కేంద్ర కసరత్తు
ఉన్నత విద్యాసంస్థల్లో రిజర్వేషన్ల అమలు కోసం కేంద్ర విద్యా శాఖ వివిధ మార్గాలను అధ్యయనం చేస్తోంది. ట్రాన్స్జెండర్లను 'ఇతర వెనుకబడిన తరగతులు' (ఓబీసీలు)గా గుర్తించి ఆ కోటాలో రిజర్వేషన్ కల్పించడానికి ఎంత మేరకు అవకాశం ఉందో ప్రభుత్వం పరిశీలిస్తోందని ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఈ విషయాన్ని మొదటగా సామాజిక న్యాయం-సాధికారత మంత్రిత్వశాఖకు తెలియపరిచింది.
ఇదీ చూడండి: లింగమార్పిడి చేసుకునేవారికి 5 లక్షల ఆర్థిక సాయం!