తాము సేకరించే కరోనా టీకాలను అన్ని రాష్ట్రాలకు ఉచితంగానే అందజేస్తామని కేంద్రం స్పష్టం చేసింది. 45 ఏళ్లు పైబడిన వారి కోసం కేంద్రం ప్రస్తుతం రాష్ట్రాలకు కరోనా టీకాలను ఉచితంగా సరఫరా చేస్తోంది. ఐతే 18 ఏళ్లు దాటిన వారికి కూడా మే 1 నుంచి టీకాలు అందజేస్తామని కేంద్రం ఇటీవల ప్రకటించింది. టీకా తయారీ కంపెనీలు తమ ఉత్పత్తిలో 50శాతం రాష్ట్రాలు, ప్రైవేటు కంపెనీలకు విక్రయించుకోవచ్చని స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో కొవిషీల్డ్ టీకాను తయారు చేస్తున్న సీరం ఇనిస్టిట్యూట్ టీకా ధరలను ప్రకటించింది. కేంద్రానికి విక్రయించే టీకా ఒక్కోటి 150 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వాలకు 4వందల రూపాయలు, ప్రైవేటు కంపెనీలకు 650 రూపాయలకు విక్రయిస్తామని తెలిపింది. కేంద్ర, రాష్ట్రాలకు సరఫరా అయ్యే టీకా ధరల్లో తేడాలపై విమర్శల నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ ట్విట్టర్‌లో స్పష్టత ఇచ్చింది.