తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా పరిస్థితిపై కేంద్ర కేబినెట్ కార్యదర్శి సమీక్ష - దేశంలో కరోనా పరిస్థితి

దేశంలో కొవిడ్ వ్యాప్తి రెండోదశ ఆందోళనకరంగా మారుతున్న వేళ సమీక్ష నిర్విహించారు కేంద్ర కేబినెట్​ కార్యదర్శి రాజీవ్​ గౌబ. కరోనా తీవ్రత అధికంగా ఉన్న 11 రాష్ట్రాలు సహా కేంద్ర పాలిత ప్రాంతాల సీఎస్, డీజీపీలతో మాట్లాడారు. మహారాష్ట్రలో పరిస్థితి మరింత ఆందోళనకరం ఉందన్నారు.

Center Cabinet Secretary Rajiv Gauba  Review on Corona Situation in the country
కరోనా పరిస్థితిపై కేంద్ర కేబినెట్ కార్యదర్శి సమీక్ష

By

Published : Apr 2, 2021, 10:11 PM IST

దేశంలో కరోనా పరిస్థితిపై కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ సమీక్షించారు. 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సీఎస్‌లు, డీజీపీలతో ఆయన మాట్లాడారు. ఎక్కువ కరోనా కేసులు, మరణాలు నమోదవుతున్న రాష్ట్రాలపై దృష్టిసారించారు. కేసుల పెరుగుదలను అరికట్టే చర్యలు చేపట్టాలని రాష్ట్రాలకు సూచించారు.

11రాష్ట్రాల్లోనే కరోనా తీవ్రత అధికంగా ఉందన్నారు కేబినెట్ కార్యదర్శి రాజీవ్​. మహారాష్ట్రలో పరిస్థితి మరింత ఆందోళనకరం ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కరోనా నిబంధనలను కఠినంగా అమలుచేయాలని మహారాష్ట్రకు సూచించారు. పట్టణాల నుంచి గ్రామాలకు వైరస్​ వ్యాపించకుండా చూడాలన్నారు. కేసుల ఉద్ధృతి పెరిగితే వైద్య సౌకర్యాల కల్పన కష్టతరమవుతుందన్నారు. రాష్ట్రాలు అన్ని ప్రభుత్వ శాఖలను అప్రమత్తం చేయాలన్నారు.

ఇదీ చూడండి:'వైరస్ ఉద్ధృతి ఇలాగే ఉంటే లాక్​డౌన్​ను​ తోసిపుచ్చలేం'

ABOUT THE AUTHOR

...view details