తాత్కాలిక పింఛనుకు సంబంధించిన నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సరళీకరించింది. ఉద్యోగులు పదవీ విరమణ పొందిన తేదీ నుంచి ఏడాది వరకూ తాత్కాలిక పింఛను చెల్లించేలా గడువును పొడిగించింది. కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర సిబ్బంది శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ బుధవారం వెల్లడించారు.
అర్హులైన కుటుంబ సభ్యులు కుటుంబ పింఛను క్లెయిము రసీదు, మరణ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించిన వెంటనే పింఛనును మంజూరు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. సంబంధిత క్లెయిమును చెల్లింపు, పద్దుల కార్యాలయానికి పంపించి ఎదురుచూడాల్సిన అవసరం ఇకపై ఉండబోదన్నారు.