తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Cemetery Caretaker in Election : ఎన్నికల బరిలో 'కాటికాపరి'.. లక్ష మృతదేహాలకు అంత్యక్రియలు! చిల్లరతో వచ్చి నామినేషన్​ - ఛత్తీస్​గఢ్​ అసెంబ్లీ ఎన్నికలు

Cemetery Caretaker in Election : ఛత్తీస్​గఢ్​లో ఎన్నికల ప్రచారం జోరుగా నడుస్తోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి భూపేశ్​ బఘేల్, ఉపముఖ్యమంత్రి టీఎస్​ సింగ్​దేవ్​ సహా కీలక నేతలు నామినేషన్లు సమర్పించి ఎన్నికల బరిలోకి దిగారు. వీరితో పాటు శ్మశానవాటికలో కాటికాపరిగా పనిచేసే సామాన్యుడు నామినేషన్​ వేయడం ఆసక్తికరంగా మారింది. అతడి కథేంటంటే?

Cemetery Caretaker Files Election Nomination
Cemetery Caretaker Files Election Nomination

By ETV Bharat Telugu Team

Published : Oct 31, 2023, 5:00 PM IST

Cemetery Caretaker in Election :ఛత్తీస్​గఢ్​ అసెంబ్లీ ఎన్నికల్లో అరుదైన సంఘటన జరిగింది. వైశాలి నగర్​ స్థానానికి నామినేషన్ దాఖలు చేశాడు ఓ కాటికాపరి. చిల్లర డబ్బులు తీసుకువచ్చి మరీ డిపాజిట్​ చేశాడు శంకర్​ లాల్​ సాహు అనే వ్యక్తి. 35 ఏళ్లుగా కాటికాపరి చేస్తున్న ఇతడు.. సుమారు లక్షకుపైగా మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించాడు. ఇప్పటికే ఎమ్మెల్యే, మేయర్​ సహా రెండు సార్లు కౌన్సిలర్​గా పోటీ చేశాడు. ఐదోసారి పోటీలో ఉన్న శంకర్​లాల్​.. ప్రస్తుతం స్వాభిమాన్ మంచ్​ తరఫున వైశాలి నగర్​ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు.

చిల్లరతో నామినేషన్ వేయడానికి వస్తున్న శంకర్​ లాల్

వైశాలి నగర్​లో నివసించే శంకర్ లాల్ సాహు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి. ఇతడు భిలాయ్​లోని రామ్​నగర్​ శ్మశానవాటికలో కాటికాపరిగా కాంట్రాక్ట్​ పద్ధతిలో పనిచేస్తున్నాడు. గత 35 ఏళ్లుగా ఈ వృత్తిలో కొనసాగుతున్న అతడు.. ఇప్పటికి సుమారు లక్షకుపైగా మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించానని చెబుతున్నాడు. కొవిడ్​ సమయంలో సొంత కుటుంబ సభ్యులే.. మృతదేహాలను విడిచిపెట్టి వెళ్తున్న క్రమంలో తాను ఎన్నింటికో అంతిమ సంస్కారాలు చేశానని చెప్పుకొచ్చాడు శంకర్​లాల్​. కరోనా కాలంలో దాదాపు 80 మృతదేహాలను దహనం చేసినట్లు తెలిపాడు. గుర్తు తెలియని మృతదేహాలను సైతం దహనం చేసినట్లు చెప్పాడు. చివరకు ఈ వృత్తిలో కూడా అవినీతి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు నెల జీతం రూ.12వేలు కాగా.. దీనిని ఇచ్చేందుకు కూడా కాంట్రాక్టర్​ లంచం అడిగాడని వాపోయాడు. మరోవైపు శంకర్​లాల్​.. ఇదే కాకుండా పలు ఛత్తీస్​గఢ్​ సినిమాలు, ఆల్బమ్స్​లోనూ నటించాడు. ఛత్తీస్​గఢ్​లో మంచి గుర్తింపు తెచ్చుకున్న 'చార్​ చినాహరి నర్వ గర్వ గుర్వ బరి' పాటను సైతం రాశాడు.

డిపాజిట్ కోసం శంకర్ లాల్​ తెచ్చిన చిల్లర

'నన్ను గెలిపిస్తే వైశాలినగర్​ రూపురేఖలు మారుస్తా'
ఈసారి ఎన్నికల్లో తనను గెలిపిస్తే వైశాలి నగర్​ రూపురేఖలు మారుస్తానని శంకర్​లాల్​ హామీ ఇస్తున్నాడు. వైశాలి నగర్​ అభివృద్ధి పేరిట ప్రజలు ప్రతిసారి మోసపోతూనే ఉన్నారని చెప్పాడు. నియోజకవర్గం ఇప్పటికే వెనుకబడి ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు శంకర్​లాల్.

నామినేషన్​ వేస్తున్న శంకర్​ లాల్

రెండు దశల్లో ఛత్తీస్​గఢ్​ ఎన్నికలు
Chhattisgarh Elections 2023 : కాగా ఛత్తీస్​గఢ్​లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. తొలివిడతలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన 20 నియోజకవర్గాల్లో నవంబరు 7న పోలింగ్ జరగనుంది. మిగిలిన 70 స్థానాలకు నవంబరు 17న పోలింగ్‌ నిర్వహించనున్నారు.

Bhupesh Baghel Properties : నామినేషన్ వేసిన ఛత్తీస్​గఢ్​ సీఎం.. బఘేల్​ ఆస్తులు ఎంతో తెలుసా?

Bastar Maoist Affected Areas : 'బస్తర్​' మే సవాల్​.. స్వాతంత్ర్యం తర్వాత తొలిసారి పోలింగ్ కేంద్రాలు.. భారీ భద్రత

ABOUT THE AUTHOR

...view details