తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బీఆర్ అంబేడ్కర్‌కు ప్రముఖుల ఘన నివాళులు - president paid tribute to BR Ambedkar

బీఆర్ అంబేడ్కర్‌ వర్ధంతిని పురస్కరించుకుని రాజ్యాంగ నిర్మాతకు పలువురు ప్రముఖులు వివాళులు అర్పించారు. పార్లమెంట్‌ కాంప్లెక్స్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద అంజలి ఘటించి ఆయన సేవలు గుర్తుచేసుకున్నారు.

Celebrities paid tribute to BR Ambedkar
బీఆర్ అంబేద్కర్​కు నివాళి అర్పించిన ప్రముఖులు

By

Published : Dec 6, 2022, 1:04 PM IST

భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్‌ వర్ధంతి సందర్భంగా పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. పార్లమెంట్‌ కాంప్లెక్స్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌, ప్రధాని నరేంద్ర మోదీ అంజలి ఘటించారు. బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమన్న మోదీ.. విస్తృత రాజ్యాంగం అందించేందుకు ఆయన చేసిన కృషి మరువలేనిదన్నారు.

అంబేడ్కర్‌ పోరాటం లక్షలాది మందిలో స్ఫూర్తిని రగిలించిందని ప్రధాని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్‌ నేత సోనియాగాంధీ కూడా అంబేడ్కర్‌కు నివాళులు అర్పించారు.

బీఆర్ అంబేడ్కర్‌కు నివాళి అర్పించిన రాష్ట్రపతి
బీఆర్ అంబేడ్కర్‌కు నివాళి అర్పించిన ప్రధాని
బీఆర్ అంబేడ్కర్‌కు నివాళి అర్పించిన ప్రముఖులు
బీఆర్ అంబేడ్కర్‌కు నివాళి అర్పించిన కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే, సోనియాగాంధీ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details