CEC fires karnataka Government on Adds in Telangana :కర్ణాటక ప్రభుత్వంపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణలో కర్ణాటక సర్కార్ ప్రకటనలు ఇవ్వడాన్ని ఈసీ తీవ్రంగా పరిగణించింది. ఈ నేపథ్యంలో కర్ణాటక సీఎస్‌కు.. కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. ప్రకటనల జారీ ఎన్నికల నియమావళి ఉల్లంఘన అవుతుందని.. ఈసీ(CEC) తన లేఖలో పేర్కొంది. రేపు సాయంత్రం 5లోపు వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక నుంచి ప్రకటనలు ఆపివేయాలని సూచించింది. ప్రకటనల జారీపై సంబంధిత శాఖ కార్యదర్శిపై చర్యలు ఎందుకు తీసుకోరాదో తెలపాలని లేఖలో పేర్కొంది. రెండు రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులకు ఈసీ సమాచారం పంపింది.
కర్ణాటక ప్రభుత్వంపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం - CEC fires karnataka adds in telangana
Published : Nov 27, 2023, 9:21 PM IST
|Updated : Nov 27, 2023, 9:52 PM IST
21:07 November 27
breaking
తెలంగాణలో కర్ణాటక ప్రభుత్వ పథకాలను ప్రచారం చేస్తున్నారంటూ.. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. రాష్ట్రంలో ఎన్నికల వేళ స్థానిక మీడియాలో.. కర్ణాటక ప్రభుత్వ ప్రచారాలను తప్పుబడుతూ తమ ఫిర్యాదులో పేర్కొన్నాయి. బీజేపీ, బీఆర్ఎస్ ఫిర్యాదులపై స్పందించిన ఈసీ.. ప్రకటనల కోసం కర్ణాటక ప్రభుత్వం అనుమతి తీసుకోలేదని తెలిపింది. కర్ణాటక సర్కార్ కనీసం దరఖాస్తు చేయలేదని పేర్కొంది.
కేటీఆర్‌కు ఇచ్చిన నోటీసుపై ఇంకా వివరణ అందలేదు : వికాస్‌రాజ్