Covovax approval India: సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (పుణె) తయారుచేసిన 'కొవొవాక్స్', బయోలాజికల్-ఈ తయారు చేసిన కార్బెవాక్స్ అత్యవసర వినియోగానికి అనుమతులిచ్చింది సీడీఎస్సీఓ(కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ). మోల్నుపిరవిర్ డ్రగ్‌కు కూడా అత్యవసర వినియోగానికి అనుమతులు లభించాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు.
మరో రెండు కరోనా వ్యాక్సిన్లు, ఔషధానికి కేంద్రం అనుమతి - కొవొవాక్స్ టీకా అనుమతులు
![మరో రెండు కరోనా వ్యాక్సిన్లు, ఔషధానికి కేంద్రం అనుమతి Covovax Corbevax Molnupiravir](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14029359-thumbnail-3x2-vaccine.jpg)
11:28 December 28
మరో రెండు కరోనా వ్యాక్సిన్లు, ఔషధానికి కేంద్రం అనుమతి
కొవొవాక్స్, కార్బెవాక్స్, మోల్నుపిరవిర్కు అత్యవసర వినియోగానికి షరతులతో కూడిన అనుమతులివ్వాలని నిపుణుల కమిటీ సిఫార్సు చేసిన ఒక రోజు వ్యవధిలోనే సీడీఎస్సీఓ ఈ నిర్ణయం తీసుకుంది.
Corbevax vaccine latest news:
"భారత్‌కు శుభాకాంక్షలు.. కరోనాపై పోరాటాన్ని మరింత దృఢంగా తీర్చిదిద్దేందుకు కార్బెవాక్స్, కొవొవాక్స్, మోల్నుపిరవిర్లను ఒకే రోజులో సీడీఎస్సీఓ, కేంద్ర ఆరోగ్యశాఖ అనుమతులిచ్చాయి," అని మాండవీయ ట్వీట్ చేశారు.
తాజా అనుమతులతో దేశంలో అత్యవసర వినియోగానికి అందుబాటులో ఉన్న టీకాల సంఖ్య ఎనిమిదికి చేరింది. కొవిషీల్డ్, కొవాగ్జిన్, జైడస్ క్యాడిలా, స్పుత్నిక్ వీ, మొడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్‌లకు ఇప్పటికే అనుమతులు లభించాయి.