తెలంగాణ

telangana

ETV Bharat / bharat

టీకాల మిశ్రమ డోసులపై ప్రయోగాలు - కొవిషీల్డ్​ వ్యాక్సిన్​ మిక్సింగ్

కొవాగ్జిన్​, కొవిషీల్డ్​ టీకాల మిశ్రమ డోసులపై ప్రయోగాలు నిర్వహించేందుకు అనుమతించాలని కేంద్రానికి నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. ఆరోగ్యంగా ఉన్న 300 మంది వాలంటీర్లపై ప్రయోగాలు నిర్వహిస్తారు.

covaxin covishield mix, expert panel on vaccine mixing
టీకాల మిశ్రమ డోసులపై ప్రయోగాలు

By

Published : Jul 30, 2021, 5:49 AM IST

కొవిడ్‌-19 నివారణకు రూపొందిన కొవాగ్జిన్, కొవిషీల్డ్‌ టీకాలతో కూడిన మిశ్రమ డోసులపై ప్రయోగాలు నిర్వహించేందుకు అనుమతినివ్వాలని కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థలోని నిపుణుల కమిటీ.. ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. తమిళనాడులోని క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజీ (సీఎంసీ)లో ఈ ప్రయోగాలు జరుగుతాయి. ఓ వ్యక్తికి ఒక డోసు కొవాగ్జిన్​ను, మరో డోసు కొవిషీల్డ్‌ను ఇవ్వవచ్చా అన్నది పరిశీలించడం దీని ఉద్దేశం. ఆరోగ్యంగా ఉన్న 300 మంది వాలంటీర్లపై ప్రయోగాలు నిర్వహిస్తారు.

కొవాగ్జిన్​ తయారీ సంస్థ భారత్‌ బయోటెక్‌... ముక్కు ద్వారా వేసే కొవిడ్‌ వ్యాక్సిన్​ను అభివృద్ధి చేసి, దానిపై ప్రయోగాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ టీకాను, కొవాగ్జిన్​ను కలిపి వాడే అంశంపై అధ్యయనానికి భారత్‌ బయోటెక్‌కు అనుమతినివ్వాలని కూడా నిపుణుల కమిటీ సూచించింది.

ఇదీ చదవండి :పెద్దలకు మాత్రమే.. అస్సలు మిస్​ కావద్దు

ABOUT THE AUTHOR

...view details