Cds responsibilities: తమిళనాడులో బుధవారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో త్రిదళాధిపతి (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ (63), ఆయన సతీమణి మధులిక సహా మొత్తం 14 మంది మరణించారు. భారత సైన్యానికి బిపిన్ రావత్ దాదాపు 43 ఏళ్ల పాటు సేవలు అందించారు. ఎన్నో సంస్కరణలు తీసుకురావడంలో ముఖ్య పాత్ర పోషించారు. ఇంతకీ సీడీఎస్‌గా ఆయన నిర్వర్తించిన బాధ్యతలేంటంటే..
- త్రివిధ దళాలకు సంబంధించి ప్రభుత్వానికి ఏకైక (సింగిల్ పాయింట్) సలహాదారుగా సేవలు
- దేశ వ్యూహాత్మక వనరులు, అణ్వాయుధాలను మెరుగ్గా నిర్వహించడం
- వివిధ విభాగాల మధ్య సమన్వయం, వ్యూహాలు, కొనుగోళ్లు, నిర్వహణ ప్రక్రియలో సమస్యల పరిష్కారం ద్వారా త్రివిధ దళాల మధ్య సమష్ఠితత్వం తీసుకురావడం
- దీర్ఘకాలిక సైనిక ప్రణాళిక, సేకరణ విధానాలను క్రమబద్ధం చేయడం
- రక్షణ మంత్రిత్వశాఖతో సైనిక దళాల ప్రధాన కార్యాలయాలను ఏకీకృతం చేయడం, పౌర-మిలిటరీ మధ్య అంతరాన్ని తగ్గించడం
ఈ పోస్ట్ ఏర్పాటు ఎలా?
Cds post in india: 1999లో కార్గిల్ యుద్ధం అనంతరం ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం త్రిదళాధిపతి (సీడీఎస్) పోస్ట్ ఏర్పాటు అవసరాన్ని కీలకంగా సూచించింది.
ప్రపంచవ్యాప్తంగా అమెరికా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ సహా 70కి పైగా దేశాలు మిలిటరీ వ్యూహాలు, నిర్వహణకు త్రిదళాధిపతి తరహా పోస్ట్‌ని కలిగి ఉన్నాయి.
ఇదీ చూడండి:సీడీఎస్ ప్రయాణించిన హెలికాప్టర్ భద్రతపై అనుమానాలు!