తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మీ త్యాగం భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయకం' - సైనిక దినోత్సవం రోజున నివాళులర్పించిన బిపిన్ రావత్​

సైనికులు త్యాగం, శౌర్యం దేశ ప్రజలకు స్ఫూర్తినిస్తాయని తెలిపారు త్రిదళాధిపతి జనరల్​​ బిపిన్​ రావత్. ఆర్మీ డే సందర్భంగా అమర జవాన్లకు నివాళులర్పించారు.

CDS Rawat pays homage, expresses gratitude to soldiers on Army Day
'మీ త్యాగాలు నిరంతర స్ఫూర్తిదాయకాలు'

By

Published : Jan 15, 2021, 11:54 AM IST

భారత సైనిక దినోత్సవం సందర్భంగా సైనికుల సేవలకు గుర్తు చేసుకున్నారు త్రిదళాధిపతి (సీడీఎస్​) జనరల్​ బిపిన్​ రావత్​. జవాన్ల త్యాగం, శౌర్యం భవిష్యత్తు తరాలకు స్ఫూర్తినిస్తుందన్నారు.

ఈ చారిత్రక రోజు సందర్భంగా వీర సైనికులకు నివాళులర్పిస్తున్నాం. వారి విధినిర్వహణలో శౌర్యం, త్యాగం, దేశం పట్ల అసమానమైన భక్తి భవిష్యత్తు తరాలకు స్ఫూర్తినిస్తుంది.

-బిపిన్​ రావత్​, ఆర్మీ చీఫ్​

వందేళ్ల జవానుకు సత్కారం..

భారత మాజీ జవాను, త్రివిద దళాల్లో సేవలందించిన వీరుడు కల్నల్​ ప్రీతిపాల్​ సింగ్​ (రిటైర్డ్​) ఇటీవలే వందో జన్మదినం జరుపుకున్నారు. ఇవాళ వెటరన్​ డే సందర్భంగా.. త్రిదళాధిపతి జనరల్​ బిపిన్​ రావత్​ తరఫున వెండి మెడల్​ బహూకరించి ఆయన్ను సత్కరించారు.

కల్నల్​ ప్రీతిపాల్​ సింగ్​కు​ వెండి మెడల్​ బహూకరిస్తున్న సైనికాధికారి

ఇదీ చదవండి:'జాతి గర్వాన్ని దెబ్బతీస్తే ఏ శక్తికైనా దీటుగా బదులిస్తాం'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details