నవంబర్ 29 నుంచి డిసెంబర్ 23 వరకు పార్లమెంటు శీతాకాల సమావేశాలను(Parliament Winter Session 2021) నిర్వహించాలని పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీపీఏ) సిఫార్సు చేసింది. ఈ మేరకు అధికార వర్గాలు తెలిపాయి. రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నేతృత్వంలోని సీసీపీఏ కమిటీ ఈ తేదీలను సిఫార్సు చేసినట్లు పేర్కొన్నాయి.
కరోనా దృష్ట్యా..
కరోనా నేపథ్యంలో గత ఏడాదిన్నర కాలంలో నిర్వహించినట్లుగానే కొవిడ్-19 నిబంధనల మధ్య సమావేశాలు జరగనున్నాయి. కరోనా కారణంగా గతేడాది శీతాకాల సమావేశాలు(Parliament Winter Session 2021) నిర్వహించలేదు. రాజ్యసభ, లోక్‌సభ సభ్యులు కొవిడ్ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. సమావేశాలకు ముందు సభ్యులు కరోనా టెస్టు చేయించుకోవాల్సి ఉంటుంది.