ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రూ.5000 ఇస్తే రోజుకు రూ.49 వడ్డీ.. నమ్మి పెట్టుబడి పెడితే.. - banaglore crime news

ఎక్కువ వడ్డీ ఇస్తామని ప్రజలకు ఆశచూపి రూ.40కోట్ల మోసానికి పాల్పడ్డ ముఠా గుట్టును బెంగళూరు సెంట్రల్ క్రైంబ్రాంచ్ పోలీసులు రట్టు చేశారు. నిందితుల నుంచి భారీగా నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నారు.

ccb-has-found-a-fraudulent-network
స్కీమ్​ పేరుతో రూ.40కోట్ల స్కామ్​.. వేల మందికి టోకరా..
author img

By

Published : Apr 19, 2022, 1:59 PM IST

'కొద్ది రోజుల్లోనే మీ డబ్బును రెట్టింపు చేస్తాం' అని చెప్పి స్కీమ్​ పేరుతో భారీ స్కామ్​కు పాల్పడ్డ ముఠాను బెంగళూరు సెంట్రల్ క్రైంబ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.17కోట్ల నగదు, రూ.2 కోట్లు విలువ చేసే ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వీరంతా ప్రజలను రూ.40కోట్ల మేర మోసం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులను ఇమ్రాన్, శీతల్ బస్తవాడి, జబియుల్లా ఖాన్​, రెహ్మాతుల్లా ఖాన్​గా గుర్తించారు.

in article image
స్కీమ్​ పేరుతో రూ.40కోట్ల స్కామ్​.. వేల మందికి టోకరా..
స్కీమ్​ పేరుతో రూ.40కోట్ల స్కామ్​.. వేల మందికి టోకరా..

రూ.5000 పెట్టుబడి పెడితే రోజుకు రూ.49 వడ్డీ ఇస్తామని నిందితులు ప్రజలకు సందేశాలు పంపేవారు. వారిని నమ్మించడానికి గూగుల్​ ప్లే స్టోర్​ షేర్​హ్యాష్ యాప్​ను డౌన్​లోడ్ చేసుకోవాలని చెప్పేవారు. ఎవరికీ అనుమానం రాకుండా కొద్ది రోజులు వడ్డీ జమ చేశారు. ఈ స్కీమ్ కోసం ఏకంగా 900 వాట్సాప్​ గ్రూప్​లు క్రియేట్ చేశారు. ఒక్కో గ్రూప్​లో 256 మంది సభ్యులున్నారంటే వీరి డిమాండ్ అర్థం చేసుకోవచ్చు. కరోనా లాక్​డౌన్ సమయం నుంచి నిందితులు ఈ దందా నడుపుతున్నారు. ఇన్వెస్టర్లు భారీగా పెరిగిన తర్వాత ఆ డబ్బునంతా కాట్యాట్​ టెక్నాలజీ కంపెనీ, సిరోలిన్ టెక్ సొల్యూషన్స్​, నైలిన్​ ఇన్ఫోటెక్​, మాల్ట్రెస్​ ఎగ్జిమ్, క్రాపింగ్టన్​ అనే సంస్థలకు బదిలీ చేశారు.

స్కీమ్​ పేరుతో రూ.40కోట్ల స్కామ్​.. వేల మందికి టోకరా..

తీరా 2022 జనవరిలో షేర్​హ్యాష్​ యాప్​ సాంకేతిక కారణాల వల్ల పనిచేయడం లేదని నిందితులు ఇన్వెస్టర్లకు చెప్పారు. త్వరలోనే అప్డేట్ చేసి కొత్త వెర్షన్​ను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. కానీ నెలలు గడిచినా యాప్​ రిలీజ్ కాలేదు. ఇన్వెస్టర్ల డబ్బు వాపస్​ రాలేదు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి విచారించగా.. అసలు స్కామ్ బయటపడింది. ఈ ముఠా నుంచి నగదు, బంగారంతో పాటు ల్యాప్​టాప్​లు, విలువైన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఎయిర్​టెల్​, ఐసీఐసీఐకి ఫైన్​:మరోవైపు.. సైబర్​ మోసానికి గురైన బాధితుడికి పరిహారం చెల్లించాలని ఎయిర్​టెల్, ఐసీఐసీఐ బ్యాంక్​కు ఆదేశాలు జారీ చేసింది వినియోగదారుల కమిషన్. తమిళనాడు చెన్నైలోని వెస్ట్ తంబరానికి చెందిన జే యేసుదయాన్ అనే వ్యక్తి 2012లో ఎయిర్​టెల్ పోస్ట్​పెయిడ్​ నంబర్​ను వినియోగించేవాడు. ఓ రోజు ఉన్నట్టుండి అతని నంబర్​ పని చేయడం ఆగిపోయింది. తన అనుమతి లేకుండా నంబర్ రద్దు చేశారని ఎయిర్​టెల్​ను సంప్రదించినా స్పందన సరిగ్గాలేదు. వేరే నంబర్​ తీసుకోవాలని అతనికి సూచించారు సిబ్బంది. అదే సమయంలో అతని ఐసీఐసీఐ బ్యాంకు ఖాతా నుంచి రూ.4.89 లక్షలు ట్రాన్స్​ఫర్ అయ్యాయి. అతనికి తెలియని నాలుగు ఖాతాల్లోకి ఈ మొత్తం వెళ్లింది. దీంతో అతను జిల్లా వినియోగదారుల కమిషన్​కు ఫిర్యాదు చేశాడు. సేవలు నిలిపివేసి వినియోగదారుడ్ని ఇబ్బంది పెట్టడమేగాక, మానసిక ఒత్తిడికి కారణమయ్యారని కమిషన్​ ఎయిర్​టెల్​, ఐసీఐసీఐ బ్యాంకుకు ఫైన్ వేసింది. అతనికి రూ.4.89లక్షల పరిహారంతో పాటు ఒత్తిడికి గురి చేసినందుకు మరో రూ.2లక్షలు చెల్లించాలని ఆదేశించింది. అతని ఫిర్యాదు ఖర్చులు రూ.10వేలు కూడా కలిపి నెల రోజుల్లో చెల్లించాలని చెప్పింది.

ఇదీ చదవండి:కళ్లల్లో కారం కొట్టి రూ.కోటి చోరీ.. పట్టపగలే నడిరోడ్డుపై..

ABOUT THE AUTHOR

...view details