వచ్చే ఏడాది 10, 12వ తరగతి బోర్డు పరీక్షలకు (cbse board exams) హాజరయ్యే విద్యార్థుల్లో కొవిడ్-19 కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన వారు ఎలాంటి రిజిస్టేషన్, పరీక్ష ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదని (cbse news) సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) పేర్కొంది. 10, 12వ తరగతి పరీక్షల కోసం జరుగుతున్న రిజిస్ట్రేషన్ ప్రక్రియ నవంబర్ 30తో ముగియనుంది.
cbse news: 'తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థులకు ఫీజు లేదు'
కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థులకు సీబీఎస్ఈ (cbse news) ఉపశమనం కల్పించింది. అలాంటి వారు వచ్చే ఏడాది జరగనున్న 10, 12వ తరగతి పరీక్షల (cbse board exams) కోసం ఎలాంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టంచేసింది.
సీబీఎస్ఈ
"కొవిడ్-19 మహమ్మారి దేశంలో చాలా మందిపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది. కరోనా కారణంగా (cbse covid news) తల్లిదండ్రులను లేదా తల్లిదండ్రుల్లో ఒకరిని కోల్పోయిన విద్యార్థుల నుంచి సంబంధించి రిజిస్టేషన్, పరీక్ష ఫీజులు వసూలు చేయరాదని సీబీఎస్‌ఈ నిర్ణయించింది" అని సీబీఎస్‌ఈ పరీక్షల అధికారి భరద్వాజ్ చెప్పారు.
ఇదీ చూడండి:CBSE news: ప్రతిభను కొలిచే సాధనం- రెండు పరీక్షల విధానం