పది, పన్నెండో తరగతి పరీక్షల (CBSE Exam news) షెడ్యూల్ను ఇదివరకే విడుదల చేసిన సీబీఎస్ఈ.. ఎగ్జామ్ సెంటర్ల విషయంలో విద్యార్థులకు వెసులుబాటు కల్పించింది. అడ్మిషన్ తీసుకున్న నగరాల్లో కాకుండా ఇతర ప్రాంతాల్లో ఉంటున్న విద్యార్థులకు.. తమ పరీక్ష కేంద్రాన్ని మార్చుకునే వీలు కల్పిస్తున్నట్లు తెలిపింది.
చాలా మంది విద్యార్థులు స్వస్థలాలకు దూరంగా ఉంటూ చదువుకుంటున్నారని, ఇలాంటి వారి నుంచి వచ్చిన అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకొని తాజా నిర్ణయం తీసుకున్నట్లు సీబీఎస్ఈ ఎగ్జామినేషన్ కంట్రోలర్ సన్యమ్ భరద్వాజ్ పేర్కొన్నారు. దీనిపై విద్యార్థులకు త్వరలో సూచనలు జారీ చేస్తామని తెలిపారు.
అందరు విద్యార్థులు, అన్ని పాఠశాలలు సీబీఎస్ఈ వెబ్సైట్ను తరచూ చెక్ చేస్తూ ఉండాలని సూచించారు. దీనిపై ప్రకటన వెలువడగానే పరీక్షా కేంద్రం మార్పుపై విద్యార్థులు తమ పాఠశాలలకు అభ్యర్థన చేసుకోవాలన్నారు. పరీక్ష కేంద్రాల మార్పు కోసం అనుమతించే సమయం పరిమితంగానే ఉంటుందని స్పష్టం చేశారు. షెడ్యూల్ టైమ్ దాటిన తర్వాత కేంద్రం మార్పును అనుమతించేది లేదని తేల్చి చెప్పారు.
రెండు టర్మ్ పరీక్షలు