CBSE Term 2 Board Exams:సీబీఎస్ఈ 10, 12 తరగతుల పరీక్షలను ఈసారి ఆఫ్‌లైన్‌లో నిర్వహించనున్నట్లు బోర్డు ప్రకటించింది. రెండో టర్మ్ బోర్డు పరీక్షలను ఏప్రిల్ 26 నుంచి ఆఫ్‌లైన్‌లో చేపట్టనున్నట్లు సీబీఎస్ఈ వెల్లడించింది.
దేశంలో కరోనా పరిస్థితులపై వివిధ విభాగాల అధికారులతో సమావేశం నిర్వహించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీబీఎస్ఈ పరీక్షల కంట్రోలర్ సాన్యం భరద్వాజ్ తెలిపారు.