సీబీఎస్‌ఈ పదో తరగతి వార్షిక ఫలితాలను జులైలో విడుదల చేయనున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ పరీక్షల నియంత్రణ మండలి ఒక ప్రకటనలో తెలిపింది. పదో తరగతి ఫలితాలను జూన్ మూడో వారంలోనే విడుదల చేస్తామని సీబీఎస్‌ఈ గతంలో వెల్లడించింది. అయితే ఆబ్జెక్టివ్ క్రైటీరియా తయారీలో ఆలస్యం కావడంతో ఫలితాలను జులైలో విడుదల చేయనున్నట్లు బోర్డు వెల్లడించింది.
జూన్ మూడో వారం నాటికి ఇంటర్నల్ మార్కులను బోర్డుకు సమర్పించాల్సిందిగా అన్ని పాఠశాలలను బోర్డు గతంలో కోరింది. అదే వారంలో ఫలితాలను విడదల చేయాలనుకుంది. కానీ ఈ ప్రక్రియ ఆలస్యం కానుండటంతో అనుకున్న సమయానికి ఫలితాలు వెల్లడించలేకపోతున్నట్లు సీబీఎస్‌ఈ పేర్కొంది.