సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల.. బాలికలదే పైచేయి
सीबीएसई 12वीं क्लास का परीक्षा परिणाम घोषित हो चुके हैं. छात्र डिजिलॉकर पर अपना परीक्षा परिणाम देख सकते हैं.
10:05 July 22
సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల.. బాలికలదే పైచేయి
CBSE 12th Result 2022: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) 12వ తరగతి ఫలితాలు శుక్రవారం ఉదయం 10 గంటలకు విడుదలయ్యాయి. ఈ ఉదయం సీబీఎస్‌ఈ బోర్డు ఫలితాలను ప్రకటించింది. ఈ ఫలితాలను బోర్డు అధికారిక వెబ్‌సైట్లు results.cbse.nic.in లేదా cbse.gov.in ద్వారా తెలుసుకోవచ్చని బోర్డు వెల్లడించింది. వీటితో పాటు డిజిలాకర్, పరీక్షా సంగమ్‌నుంచి కూడా ఫలితాలను తెలుసుకోవచ్చు. విద్యార్థులు తమ రూల్ నంబర్లు, స్కూల్ నంబర్లతో ఈ ఫలితాలను పొందవచ్చు.
మొత్తం 92.71 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులు అయ్యారని బోర్డు పేర్కొంది. బాలురపై బాలికలు పైచేయి సాధించారు. బాలికల్లో 94.54 శాతం పాసవ్వగా.. బాలురుల్లో ఇది 91.25 శాతం. 33 వేల మందికిపైగా విద్యార్థులు 95 శాతం కంటే ఎక్కువ స్కోరు సాధించారని సీబీఎస్‌ఈ స్పష్టం చేసింది. లక్షా 34 వేలమంది.. 90 శాతం కంటే ఎక్కువ మార్కులు పొందారని వెల్లడించింది. ప్రాంతాల వారీగా అత్యధికంగా తిరువనంతపురంలో 98.83శాతం, బెంగళూరులో 98.16శాతం ఉత్తీర్ణత నమోదైంది.
కరోనా కారణంగా ఈసారి సీబీఎస్‌ఈ 12 తరగతి పరీక్షలను రెండు విడతలుగా నిర్వహించారు. గతేడాది నవంబర్- డిసెంబర్లో మొదటి టర్మ్, ఈ మే-జూన్లో రెండో టర్మ్ పరీక్షలు జరిగాయి. టర్మ్ 1 పరీక్షలను మల్టిపుల్ ఛాయిస్ విధానంలో, టర్మ్ 2 పరీక్షలను వ్యాసరూప, సంక్షిప్త సమాధాన ప్రశ్నల రూపంలో నిర్వహించారు. వెయిటేజీ ఆధారంగా తుది ఫలితాలను వెల్లడించారు. టర్మ్-1 ఎగ్జామ్కు 30 శాతం, టర్మ్-2 పరీక్షకు 70 శాతం వెయిటేజీ ఇచ్చినట్లు ప్రకటించారు.