తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సీబీఎస్​ఈ విద్యార్థులకు ఊరట- సిలబస్​లో కోత

10వ తరగతి విద్యార్థుల కోసం సాంఘిక శాస్త్రంలోని పాఠ్యాంశాలను సీబీఎస్​ఈ తగ్గించింది. కొవిడ్​ పరిస్థితుల దృష్ట్యా.. పరీక్షల్లో విద్యార్థులు ఇబ్బంది పడకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకుంది. సవరించిన పాఠ్యాంశాలను తమ అధికారిక వెబ్​సైట్​లో పంచుకుంది.

CBSE reduces syllabus for Class 10 social science board exam
సీబీఎస్​ఈ విద్యార్థులకు ఊరట- 'సాంఘిక'లో కోత

By

Published : Feb 25, 2021, 5:12 AM IST

దేశవ్యాప్తంగా ఉన్న 10వ తరగతి విద్యార్థులకు ఉపశమనం కలిగించే దిశగా.. సెంట్రల్​ బోర్డ్​ ఆఫ్​ సెకండరీ ఎడ్యుకేషన్​(సీబీఎస్​ఈ) కీలక నిర్ణయం తీసుకుంది. సాంఘిక శాస్త్రంలోని పాఠ్యాంశాలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. బోర్డు పరీక్షల్లో విద్యార్థుల సౌలభ్యం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది.

మే 27న పదో తరగతి సాంఘిక శాస్త్రం సీబీఎస్​ఈ బోర్డు పరీక్ష జరగాల్సి ఉంది. ఈ సబ్జెక్టులో నుంచి మొత్తం ఐదు యానిట్లను సీబీఎస్​ఈ తాజాగా తొలగించింది. సవరించిన పాఠ్యాంశాలను తమ అధికారిక వెబ్​సైట్​లో పొందుపర్చింది.కేంద్ర విద్యాశాఖ ఆదేశాలతో వివిధ సబ్జెక్టుల్లో నుంచి 30 శాతం సిలబస్​ను సీబీఎస్​ఈ తగ్గించింది.

తగ్గించిన పాఠ్యాంశాల గురించి విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తెలియజేయాలని కేంద్ర విద్యాశాఖ ఆదేశించింది. కొవిడ్​ నేపథ్యంలో సిలబస్ తగ్గింపు అంశంపై విద్యావేత్తల నుంచి సలహాలను ఆహ్వానించామని తెలిపింది. 150 మందికి పైగా అకడమిక్​ నిపుణులు తమ సూచనలను పంపారని చెప్పింది.

ఇదీ చదవండి:229 మంది పాఠశాల విద్యార్థులకు కరోనా

ABOUT THE AUTHOR

...view details