కరోనా కారణంగా పాఠశాలలపై తీవ్ర ప్రభావం పడింది. ఇప్పుడిప్పుడే విద్యాసంస్థలు తెరుచుకుంటున్నాయి. ఈ క్రమంలో 2021-22 ఏడాది పాఠ్య ప్రణాళికను విడుదల చేసింది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యూకేషన్ (సీబీఎస్ఈ). వచ్చే విద్యా సంవత్సరంలో 9 నుంచి12వ తరగతులకు సిలబల్లో ఎలాంటి కోత విధించటం లేదని స్పష్టం చేసింది. గత ఏడాది సిలబస్‌లో 30 శాతం కోత విధించిన ఛాప్టర్స్, టాపిక్స్‌ను తిరిగి ఈ ఏడాది పాఠ్యాంశాల్లో పునరుద్ధరిస్తున్నట్లు తెలిపింది సీబీఎస్ఈ.
"ఆన్లైన్ తరగతులు కొత్త విధానం కావటం వల్ల పాఠ్యాంశాల తగ్గింపు ఒక్కసారి కోసం తీసుకున్న నిర్ణయమేనని గత ఏడాదే బోర్డు ప్రకటించింది. వచ్చే విద్యాసంవత్సరంలో యథావిధిగా పాత సిలబస్ ఉంటుంది "