తెలంగాణ

telangana

ETV Bharat / bharat

CBSE పరీక్షల్లో కీలక మార్పు.. మల్టిపుల్​ ఛాయిస్​ ప్రశ్నలకే ఎక్కువ మార్కులు! - పదో తరగతి పరీక్షలపై సీబీఎస్​ఈ వార్తలు

విద్యార్థులకు ఓ శుభవార్తను వినిపించింది సీబీఎస్​ఈ. 10, 12వ తరగతి పరీక్షల్లో కీలకమైన మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది.

cbse board latest news
సీబీఎస్​ఈ పరీక్షలు తాజా వార్తలు

By

Published : Apr 6, 2023, 7:14 PM IST

Updated : Apr 6, 2023, 8:36 PM IST

సెంట్రల్​ సిలబస్​ చదివే విద్యార్థులకు గుడ్​ న్యూస్. 10, 12వ తరగతి విద్యార్థులకు నిర్వహించే వార్షిక పరీక్షల్లో కీలక మార్పులను తెస్తున్నట్లు ప్రకటించింది సీబీఎస్​ఈ బోర్డు. 2024 విద్యా సంవత్సరం నుంచి నిర్వహించే​ పరీక్షలలో అత్యధిక మార్కులు మల్టిపుల్​ ఛాయిస్​ ప్రశ్నలకే కేటాయించనున్నట్లు తెలిపింది. షార్ట్, లాంగ్ ఆన్సర్​ టైప్​ ప్రశ్నలకు ఇంతకుముందు ఉన్న మార్కుల వెయిటేజీని తగ్గిస్తున్నట్లు గురువారం వెల్లడించింది.

2024లో జరగబోయే సీబీఎస్​ఈ 10, 12వ తరగతి పరీక్షల నుంచి ఈ నిర్ణయాన్ని అమలు చేస్తామని స్పష్టం చేసింది బోర్డు. కొత్తగా మల్టిపుల్​ ఛాయిస్​ ప్రశ్నలను ప్రవేశపెట్టడం ద్వారా వివిధ రకాల ప్రశ్నలకు ఇదివరకు ఉన్న మార్కుల వెయిటేజీ తగ్గనున్నట్లు పేర్కొంది. ఈ నిర్ణయంతో ప్రశ్నాపత్రాల మూల్యాంకన విధానంలో కూడా పలు మార్పులు చేయనున్నట్లు అధికారులు చెప్పారు. నేషనల్​ ఎడ్యూకేషన్​ పాలసీ(ఎన్​ఈపీ)-2020 సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని బోర్డు తెలిపింది.

ఈ మార్పు 2023-24 అకాడమిక్​ సంవత్సరానికి మాత్రమే పరిమితం కావచ్చని సీబీఎస్ఈ బోర్డు చెప్పింది. ఎన్​సీఈఆర్​టీ మార్గదర్శాల మేరకు వచ్చే ఏడాది కొత్తగా నేషనల్​ కరికులం ఫ్రేమ్​వర్క్​తో బోర్డు పరీక్షలను రూపొందిస్తామని వివరించింది. విద్యార్థుల్లో సృజనాత్మకతతో పాటు విమర్శనాత్మక ఆలోచనా సామర్థ్యాలను పెంపొందించడంపై మరింత దృష్టి సారించామని.. పేర్కొంది. ఈ విధానంతో విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి పెరిగి మంచి ఫలితాలు సాధిస్తారని సీబీఎస్​ఈ డైరెక్టర్​ జోసెఫ్ ఇమాన్యుయెల్ అన్నారు. అందువల్ల రాబోయే సంవత్సరంలో మల్టిపుల్​ ఛాయిస్​ ప్రశ్నలే ఎక్కువ సంఖ్యలో ఉంటాయని ఆయన అన్నారు.

పదో తరగతి.. 50 శాతం ప్రశ్నలు వీటిపైనే!
10వ తరగతిలో 50 శాతం మార్కులు మల్టిపుల్​ ఛాయిస్​ క్వశ్చన్స్​, కేస్​ స్టడీస్​ ప్రశ్నలు, సోర్స్​ ఆధారిత ఇంటిగ్రేటెడ్​ లేదా విద్యార్థుల సామర్థ్యాన్ని అంచనా వేసే ప్రశ్నలే ఉండనున్నాయి. గత అకడమిక్ ఇయర్​లో ఇలాంటి ప్రశ్నలకు కేవలం 40 శాతం వెయిటేజీ ఉండేది. ఇప్పటి నుంచి ఆబ్జెక్టివ్ టైప్​ ప్రశ్నలు తప్పనిసరిగా 20 శాతం వెయిటేజీతో మల్టిపుల్​ ఛాయిస్​ ప్రశ్నలుగా ఉండనున్నాయి. షార్ట్ ఆన్సర్, లాంగ్ ఆన్సర్​ ప్రశ్నల మార్కుల వెయిటేజీని గతేడాది 40 శాతం నుంచి 30 శాతానికి తగ్గించింది బోర్డు.

12వ క్లాస్​.. 40 శాతం మార్కులు వీటి ద్వారానే!
12వ తరగతిలో కూడా 40 శాతం ప్రశ్నలు మల్టిపుల్​ ఛాయిస్​ ప్రశ్నలు, కేస్ స్టడీస్​ ఆధారిత ప్రశ్నలు, సోర్స్-బేస్డ్ ఇంటిగ్రేటెడ్ ప్రశ్నలు లేదా ఇతర రూపాల్లో విద్యార్థుల నైపుణ్యాలను పరీక్షించే వాటిపై ఉంటాయి. కాగా, గత అకడమిక్ సంవత్సరంలో ఇలాంటి ప్రశ్నలకు వెయిటేజీ కేవలం 30 శాతమే. ఇప్పటి నుంచి ఆబ్జెక్టివ్ టైప్​ ప్రశ్నలు తప్పనిసరిగా 20 శాతం వెయిటేజీతో మల్టిపుల్​ ఛాయిస్​ ప్రశ్నలు ఉండనున్నాయి. షార్ట్ ఆన్సర్, లాంగ్ ఆన్సర్ తరహా ప్రశ్నలకు గతేడాది 50 శాతం వెయిటేజీని తొలగించి 40 శాతానికి తగ్గించారు.

Last Updated : Apr 6, 2023, 8:36 PM IST

ABOUT THE AUTHOR

...view details