మే 4 నుంచి సీబీఎస్ఈ 10, 12వ తరగతుల పరీక్షలు - సీబీఎస్ఈ పరీక్షల తాజా సమాచారం
17:14 February 02
సీబీఎస్ఈ 10, 12వ తరగతుల పరీక్షల షెడ్యూల్ విడుదల
సీబీఎస్ఈ 10, 12వ తరగతుల బోర్డు పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర విద్యాశాఖ. మే 4న పరీక్షలు ప్రారంభం కానున్నట్లు వెల్లడించింది. డేట్‌షీట్ ప్రకారం.. 10వ తరగతి విద్యార్థులకు జూన్ 7న పరీక్షలు పూర్తి కానుండగా.. 12వ తరగతి వారికి జూన్ 10న ముగుస్తాయి.
ఫిబ్రవరిలో జరగాల్సిన ఈ పరీక్షలు కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడ్డాయి. వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో తాజాగా పరీక్షల తేదీలను ప్రకటించింది మంత్రిత్వశాఖ.