తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అభిషేక్'​ భార్యపై సీబీఐ ప్రశ్నల వర్షం- లావాదేవీలపై ఆరా

By

Published : Feb 23, 2021, 12:09 PM IST

Updated : Feb 23, 2021, 7:17 PM IST

bengal
బంగాల్ సీబీఐ

11:47 February 23

బొగ్గు కుంభకోణం కేసు- అభిషేక్ నివాసంలో సీబీఐ

టీఎంసీ ఎంపీ, బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు.. అభిషేక్ బెనర్జీ నివాసంలో సీబీఐ అధికారులు విచారణ చేపట్టారు. బొగ్గు కుంభకోణం కేసులో అభిషేక్ భార్య రుజిరా బెనర్జీకి నోటీసులు ఇచ్చిన సీబీఐ.. విచారణ కోసం కోల్​కతాలోని వారి నివాసానికి వెళ్లారు. 

దక్షిణ కోల్​కతా కాలిఘట్​లోని వారి నివాసంలో సుమారు 90 నిమిషాల పాటు సీబీఐ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. బొగ్గు కుంభకోణం కేసుకు సంబంధించి.. ఆమె బ్యాంకు ఖాతాల లావాదేవీలపైనే ముఖ్యంగా ఆరా తీసినట్లు తెలుస్తోంది.  

అయితే.. తొలిరోజు ప్రాథమికంగానే విచారణ జరిపారని, ఆమె సరిగా సమాధానాలు ఇవ్వలేదని అధికార వర్గాలు తెలిపాయి. రానున్న రోజుల్లో సుదీర్ఘంగా విచారించనున్నట్లు సమాచారం. 

అల్లుడి ఇంటికి మమత..

సీబీఐ అధికారులు వెళ్లకముందు దీదీ.. సైతం ఆయన ఇంటికి వెళ్లారు. దాదాపు పది నిమిషాలు అభిషేక్ నివాసంలో ఉన్న మమత ఆ తరువాత వెనుదిరిగారు. 

బొగ్గు చౌర్యానికి సంబంధించిన కేసులో ఇదివరకే అభిషేక్ భార్య రుజిర, ఆమె సోదరి మేనకా గంభీర్​కు నోటీసులు ఇచ్చారు సీబీఐ అధికారులు.

కేసులో నిందితులు వీరే..

గతేడాది నవంబర్​లో సీబీఐ ఈ కేసు నమోదు చేసింది. మాంఝీ అలియాస్ లాలా, ఈస్టర్న్ కోల్​ఫీల్డ్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ అమిత్ కుమార్ ధార్, కాజోర్ ఏరియా మేనేజర్ జయేశ్ చంద్ర రాయ్, ఈసీఎల్ చీఫ్ ఆఫ్ సెక్యూరిటీ తన్మయ్ దాస్, కాజోర్ ఏరియా సెక్యూరిటీ ఇంఛార్జ్ దేబాషిశ్ ముఖర్జీని ఈ కేసులో నిందితులుగా చేర్చింది. మాంఝీ లాలాపై.. అక్రమ మైనింగ్​కు పాల్పడటం సహా, కునుస్టోరియా, కాజోరా ప్రాంతాల్లో ఈసీఎల్​ లీజుకు తీసుకున్న మైన్ల నుంచి బొగ్గును చోరీ చేశారన్న అభియోగాలను మోపింది.

Last Updated : Feb 23, 2021, 7:17 PM IST

ABOUT THE AUTHOR

...view details