Viveka Murder Case: ఎంపీ అవినాష్‌రెడ్డి ప్రధాన అనుచరుడు గజ్జల ఉదయ్ అరెస్ట్ - Gajjala Uday Kumar Reddy arrest in viveka murder
08:40 April 14
వైఎస్ వివేకా హత్యకేసులో సీబీఐ విచారణ
CBI Arrested the Gajjala Uday Kumar Reddy: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కడప ఎంపీ అవినాష్‌రెడ్డి ప్రధాన అనుచరుడు గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. సీఆర్‌పీసీ 161 కింద నోటీసులు ఇచ్చి ఉదయ్ స్టేట్‌మెంట్ రికార్డు చేసిన సీబీఐ.. తండ్రి జయప్రకాశ్‌రెడ్డి, న్యాయవాది సమక్షంలోనే అరెస్టు చేశారు. ఉదయ్ అరెస్టు మెమోనూ అతని కుటుంబ సభ్యులకు అప్పగించిన సీబీఐ.. ఉదయ్‌కుమార్‌రెడ్డికి 41ఏ నోటీసు ఇచ్చి అరెస్టు చేసింది. అనంతరం కడప నుంచి హైదరాబాద్ సీబీఐ కోర్టుకు ఉదయ్‌ను తరలించారు. హైదరాబాద్ సీబీఐ కోర్టులో ఉదయ్‌ను హాజరుపరిచే అవకాశం ఉంది.
తుమ్మలపల్లి యురేనియం కర్మాగారంలో పని చేస్తున్న ఉదయ్‌కుమార్ రెడ్డి...సీబీఐ ఎస్పీ రామ్ సింగ్‌పై గతంలో కడప కోర్టులో ప్రైవేటు కేసు వేశారు. ఉదయ్‌కుమార్ రెడ్డి ఫిర్యాదు మేరకు రామ్ సింగ్‌పై పోలీసులు గతేడాది ఫిబ్రవరిలో కేసు నమోదు చేశారు. వివేకా హత్య జరిగిన రోజు అవినాష్ రెడ్డి, శివశంకర్ రెడ్డితో పాటు ఘటనాస్థలికి ఉదయ్‌కుమార్ రెడ్డి వెళ్లారు. గూగుల్ టేక్ అవుట్ ద్వారా ఉదయ్‌కుమార్ రెడ్డి.. భాస్కర్‌రెడ్డి ఇంట్లో ఉన్నట్లూ గుర్తించారు. వివేకా మృతదేహానికి ఉదయ్‌కుమార్ రెడ్డి తండ్రి జయప్రకాశ్‌రెడ్డి బ్యాండేజీ కట్టారు. గతంలోనూ పలుమార్లు ఉదయ్‌కుమార్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారించారు. వివేకా హత్య జరిగిన రోజు అంబులెన్స్, ఫ్రీజర్, వైద్యులను రప్పించడంలో ఉదయ్ కీలక పాత్ర పోషించారు. ఈ నెల 30లోపు వివేకా హత్య కేసు విచారణ పూర్తి చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దూకుడు పెంచిన సీబీఐ.. ఈరోజు గజ్జల ఉదయ్‌కుమార్ రెడ్డిని అరెస్ట్ చేశారు.
ఇవీ చదవండి: