తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశవ్యాప్తంగా సీబీఐ దాడులు- పిల్లల్ని వేధించే ముఠాలే టార్గెట్! - ఆన్​లైన్​లో చిన్నారులపై లైంగిక వేధింపులు

ఆన్‌లైన్‌లో చిన్నారులపై లైంగిక నేరాలకు పాల్పడే ముఠాలే లక్ష్యంగా సీబీఐ దాడులు నిర్వహించింది. దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లోని 76 చోట్ల ఏకకాలంలో సోదాలు చేసింది.

cbi
సీబీఐ

By

Published : Nov 16, 2021, 1:07 PM IST

Updated : Nov 16, 2021, 1:36 PM IST

చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వారే లక్ష్యంగా సీబీఐ భారీ ఆపరేషన్ చేపట్టింది. 14 రాష్ట్రాల్లోని 76 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు జరిపినట్లు అధికారులు తెలిపారు.

చిన్నారుల్ని లైంగికంగా వేధించిన ఆరోపణలపై ఈనెల 14న 83 మంది నిందితులపై 23 కేసులు నమోదు చేసింది సీబీఐ. వీరిచ్చిన సమాచారం ఆధారంగా ఈ దాడులు చేస్తున్నట్లు తెలిపింది.

ఆంధ్రప్రదేశ్​ సహా.. దిల్లీ, ఉత్తర్​ప్రదేశ్​, పంజాబ్‌, బిహార్‌, ఒడిశా, తమిళనాడు, రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్‌, హరియాణా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌, హిమాచల్ ప్రదేశ్‌ రాష్ట్రాల్లో సీబీఐ దాడులు నిర్వహించింది.

ఇవీ చదవండి:

Last Updated : Nov 16, 2021, 1:36 PM IST

ABOUT THE AUTHOR

...view details