రూ.1800 కోట్ల మేర బ్యాంక్ మోసానికి పాల్పడినట్లు జయ్ పాలీకెమ్ లిమిడెడ్పై.. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కేసు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి.. జయ్ పాలీకెమ్ కార్యాలయం సహా దిల్లీలోని మూడు వేర్వేరు ప్రాంతాల్లో సీబీఐ సోదాలను నిర్వహించింది.
తమ బ్యాంక్ నేతృత్వంలోని కన్సార్షియానికి రూ.18 వందల కోట్ల మోసానికి పాల్పడినట్లు జయ్ పాలీకెమ్ లిమిడెడ్ ప్రమోటర్లు, డైరెక్టర్లపైన ఎస్బీఐ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ సోదాలు చేపట్టినట్లు సీబీఐ తెలిపింది.