తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సైబర్ నేరగాళ్లపై సీబీఐ కొరడా.. 105 ప్రదేశాల్లో సోదాలు.. ఇంటర్​పోల్ సమాచారంతో... - సైబర్ నేరగాళ్లు సీబీఐ

సైబర్ నేరగాళ్లను లక్ష్యంగా చేసుకుని సీబీఐ దాడులు నిర్వహించింది. దేశవ్యాప్తంగా 105 ప్రదేశాల్లో ఈ సోదాలు జరిగాయని అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో రూ.1.5 కోట్ల నగదు, 1.5 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

CBI
సీబీఐ

By

Published : Oct 4, 2022, 8:13 PM IST

ఆర్థిక మోసాలకు పాల్పడుతున్న సైబర్​ నేరగాళ్లే లక్ష్యంగా చేసుకుని కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) దేశవ్యాప్తంగా దాడులు చేపట్టింది. 'ఆపరేషన్ చక్ర' పేరుతో 105 ప్రదేశాల్లో దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో రూ.1.5 కోట్ల నగదు, 1.5 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఆయా రాష్ట్రాల పోలీసులతో కలిసి సీబీఐ అధికారులు ఈ దాడుల్లో పాల్గొన్నారు. ఇంటర్‌పోల్, ఎఫ్​బీఐ, రాయల్ కెనడియన్ మౌంటైన్ పోలీస్, ఆస్ట్రేలియన్ ఫెడరల్ పోలీసులు ఇచ్చిన సమాచారంతోనే ఈ దాడులు జరిపినట్లు తెలిపారు.

'ఆపరేషన్‌ చక్ర' పేరుతో సీబీఐ దేశవ్యాప్తంగా 105 చోట్ల దాడులు జరపగా.. అందులో 87 ప్రదేశాలు రాష్ట్రాల్లో ఉన్నాయని అధికారులు తెలిపారు. మరో 18 ప్రదేశాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్నాయని చెప్పారు. ఈ దాడుల్లో 300 మందికి పైగా అనుమానితులను గుర్తించినట్లు తెలుస్తోంది. అండమాన్ నికోబార్ దీవుల్లో నాలుగు, దిల్లీలో ఐదు, చండీగఢ్​లో మూడు, పంజాబ్​, కర్ణాటక, అసోంలో ఒక్కొక్క చోట సోదాలు చేశామని అధికారులు తెలిపారు. అమెరికా పౌరులను లక్ష్యంగా చేసుకుని పుణె, అహ్మదాబాద్‌లలోని రెండు కాల్‌ సెంటర్​లలో సోదాలు నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని అమెరికా దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్​బీఐ)కు తెలియజేశామని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details