Lalu Prasad Yadav CBI: బెయిల్పై ఇటీవలే విడుదలైన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్కు మరో షాక్ తగిలింది. పట్నాలోని ఆయన నివాసంపై సీబీఐ అధికారులు దాడులు చేశారు. లాలూ సతీమణి రబ్రీ దేవి ఇల్లు సహా దిల్లీ, బిహార్లో లాలూకు చెందిన మొత్తం 17 చోట్ల తనిఖీలు చేస్తున్నారు. అయితే 2004 నుంచి 2009 వరకు లాలూ రైల్వే మంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో జరిగిన అక్రమాలకు సంబంధించిన ఆధారాల కోసమే సీబీఐ అధికారులు సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
Lalu CBI Raids: యూపీఏ హయాంలో లాలూ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు రైల్వే శాఖలో ఉద్యోగాలు ఇస్తామని చెప్పి.. ఆశావహుల నుంచి భూములు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వీరిలో చాలామందికి ఉద్యోగాలు కూడా వచ్చాయని తెలుస్తోంది. ఈ కుంభకోణానికి సంబంధించే సీబీఐ లాలూపై కేసు నమోదు చేసింది. ఇప్పుడు ఆయనకు చెందిన నివాసాలపై దాడులు చేసింది.