తెలంగాణ

telangana

ETV Bharat / bharat

YS Viveka Case: ఎంతసేపులో వివేకా ఇంటికి అవినాష్ వచ్చారు.. సీబీఐ ఆరా

By

Published : Apr 23, 2023, 4:31 PM IST

Updated : Apr 23, 2023, 7:01 PM IST

viveka murder case
వివేకా హత్య కేసు

16:23 April 23

అవినాష్‌రెడ్డి ఇంటి బయట పరిసరాలు పరిశీలించిన సీబీఐ బృందం

పులివెందులలో సీబీఐ టీమ్​

YS Viveka Murder Case: పులివెందులలో వివేకా ఇంటిని సీబీఐ బృందం మరోసారి పరిశీలించింది. కొత్తగా వచ్చిన సీబీఐ సిట్ బృందం అధికారులు పులివెందులలో వివేకా ఇంటి పరిసరాలను చూశారు. ఇంట్లో హత్య జరిగిన బాత్రూం, బెడ్ రూమ్ ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం వివేకా ఇంటి నుంచి బయటికి వచ్చిన సీబీఐ అధికారులు సమీపంలో ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటి వద్దకు వెళ్లారు. ఆయన ఇంటి పరిసరాలనూ పరిశీలించారు. అవినాష్ రెడ్డి ఇంటి వద్ద ఉన్న పీఏ రమణారెడ్డితో సీబీఐ అధికారులు మాట్లాడారు. తిరిగి మళ్లీ వివేకా ఇంటి వద్దకు వచ్చి సంఘటనను ఆరా తీశారు.

హత్య జరిగిన రోజు అవినాష్ రెడ్డి తన ఇంటి నుంచి వివేకా ఇంటికి ఎంత సమయంలో రావొచ్చనే దానిపై సాంకేతికంగా ఇప్పటికే ఆధారాలు సేకరించిన అధికారులు.. మరోసారి తనిఖీ చేయడానికి వచ్చినట్లు తెలుస్తోంది. వివేకా ఇంట్లో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్ ఇనయతుల్లాను అధికారులు ప్రశ్నించారు. హత్య జరిగిన రోజు ఇంట్లో ఎవరెవరు ఉన్నారనే దానిపై ఆరా తీశారు. వివేకా మృతదేహాన్ని ఫొటోలు, వీడియోలు తీసి కుటుంబసభ్యులకు ఇనయ్ తుల్లా పంపారు. సోమవారం (24వ తేదీ) సుప్రీంకోర్టులో విచారణ ఉన్న నేపథ్యంలో సీబీఐ అధికారులు తాజాగా వివేకా ఇంటిని అవినాష్ రెడ్డి ఇంటిని పరిశీలించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

హత్య జరిగిన రోజు జమ్మలమడుగు వెళ్తుండగా ఫోన్ వస్తే తిరిగివచ్చానని గతంలో అవినాష్ సీబీఐకి వెల్లడించారు. ఈ నేపథ్యంలో అవినాష్ చెప్పిన సమాచారాన్ని క్షేత్రస్థాయిలో సీబీఐ అధికారులు పరిశీలించారు. అవినాష్ పీఏను పులివెందుల రింగ్‌రోడ్ వద్దకు సీబీఐ అధికారులు తీసుకెళ్లారు. అవినాష్ గతంలో చెప్పిన విషయాలను నిర్ధరణ చేసుకునేందుకు పీఏను తీసుకువెళ్లారు. ఎంత సమయంలో వివేకా ఇంటికి అవినాష్ వచ్చారనే దానిపై సీబీఐ ఆరా తీసింది. పులివెందుల రింగ్‌రోడ్‌ వద్ద అరగంటపాటు క్షేత్రస్థాయి పరిశీలన చేసిన అనంతరం సీబీఐ టీమ్​.. తిరిగి వివేకా ఇంటికి చేరుకుంది. వివేకా ఇంట్లో హత్య జరిగిన స్థలాన్ని పరిశీలించిన అధికారులు.. వివేకా ఇంటికి అవినాష్ ఎంతసేపటికి వచ్చారనే దానిపై ఆరా తీశారు.

పులివెందుల రింగ్‌ రోడ్‌ వద్ద అరగంట పాటు సీబీఐ క్షేత్రస్థాయిలో సీబీఐ పరిశీలించింది. తిరిగి వివేకా ఇంటికి సీబీఐ అధికారులు చేరుకున్నారు. వివేకా ఇంట్లో హత్య జరిగిన స్థలాన్ని సీబీఐ అధికారులు పరిశీలించారు. వివేకా ఇంటికి అవినాష్ ఎంత సేపటికి వచ్చారనే దానిపై సీబీఐ ఆరా తీసింది. గూగుల్ టేకవుట్ ద్వారా హత్య జరిగిన రోజు అవినాష్‌ తన ఇంట్లో అనుచరులతో ఉన్నారని నిర్ధారణకు వచ్చిన సీబీఐ బృందం... ఇనయతుల్లాను వివేకా ఇంటి వద్ద దింపి సీబీఐ అధికారులు కడపకు వెళ్లారు.

ఇవీ చదవండి

Last Updated : Apr 23, 2023, 7:01 PM IST

ABOUT THE AUTHOR

...view details