తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అనిల్ దేశ్​ముఖ్​పై సీబీఐ విచారణ ప్రారంభం - Maharashtra latest news

బొంబాయి హైకోర్టు ఆదేశాలతో అనిల్‌ దేశ్‌ముఖ్‌పై ప్రాథమిక విచారణను నమోదు చేసినట్లు సీబీఐ అధికారులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి అన్ని పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

Deshmukh, anil deshmukh
అనిల్ దేశ్​ముఖ్​, మహారాష్ట్ర హెంమంత్రి

By

Published : Apr 7, 2021, 5:16 AM IST

మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) ప్రాథమిక విచారణ ప్రారంభించింది. బొంబాయి హైకోర్టు ఆదేశాలతో అనిల్‌ దేశ్‌ముఖ్‌పై ప్రాథమిక విచారణను నమోదు చేసినట్లు సీబీఐ అధికారులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి అన్ని పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

బార్లు, రెస్టారెంట్ల నుంచి ప్రతి నెల రూ.100కోట్లు వసూలు చేయాలని దేశ్‌ముఖ్‌ పోలీసు అధికారులపై ఒత్తిడి తెచ్చినట్లు ముంబయి మాజీ సీపీ పరంబీర్‌ సింగ్‌ ఆరోపించారు. ఈ ఆరోపణలపై ప్రాథమిక విచారణ జరపాలని ఇటీవల సీబీఐని బాంబే హైకోర్టు ఆదేశించింది. విచారణ జరిపేందుకు 15 రోజుల గడువును విధించింది. ఈ కేసుపై మహారాష్ట్ర సర్కారు, అనిల్‌ దేశ్‌ముఖ్‌ మంగళవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఇదీ చూడండి:అమిత్​ షా, యోగిని చంపుతామని బెదిరింపు మెయిల్

ABOUT THE AUTHOR

...view details