YS Avinash Reddy appears before CBI: వివేకా హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. వివేకా హత్య కేసులోఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఎట్టకేలకు సీబీఐ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. నేడు ఉదయం 9గంటల 40 నిమిషాల సమయంలో తన న్యాయవాదులతో కలిసి సీబీఐ కార్యాలయానికి అవినాష్ రెడ్డి వెళ్లారు. పదిన్నర గంటల సమయంలో సీబీఐ అధికారులు కార్యాలయానికి వచ్చారు. సాయంత్రం 5 గంటల సమయంలో విచారణ ముగియడంతో... అవినాష్ రెడ్డి తిరిగి కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. దాదాపు 7 గంటల పాటు అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నించారు. జూన్ 30వ తేదీ వరకూ... ప్రతి శనివారం సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలన్న హైకోర్టు ఆదేశాల మేరకు అవినాష్ రెడ్డి సీబీఐ కార్యాలయానికి వచ్చారు. వైఎస్ వివేకా హత్యకు సంబంధించి సీబీఐ అధికారులు అవినాష్ రెడ్డిని ప్రశ్నించారు. హత్య జరిగిన రోజు అర్ధరాత్రి ఎవరెవరితో మాట్లాడారనే విషయాలను సీబీఐ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం.
Avinash CBI Enquiry: సీబీఐ విచారణకు హాజరైన కడప ఎంపీ అవినాష్ రెడ్డి..
ప్రత్యేక కేటగిరీ విచారణ ఖైదీ భాస్కర్‌రెడ్డి: ఇప్పటికే ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డిని ప్రత్యేక కేటగిరీ విచారణ ఖైదీగా పరిగణించేందుకు సీబీఐ కోర్టు అంగీకరించింది. భాస్కర్‌రెడ్డికి ప్రత్యేక కేటగిరీ కల్పించాలని హైదరాబాద్ జిల్లా మేజిస్ట్రేట్‌కు సీబీఐ న్యాయస్థానం సిఫార్సు చేసింది. వివేకా హత్య కేసులో సీబీఐ అరెస్టు చేసిన భాస్కర్‌రెడ్డి గత నెల 16 నుంచి చంచల్‌గూడ జైళ్లో ఉన్నారు. తన వయసు, అనారోగ్యం, సామాజిక స్థితి తదితర విషయాలను పరిగణనలోకి తీసుకొని ప్రత్యేక కేటగిరీ కల్పించాలని భాస్కర్ రెడ్డి కోరారు. మరోవైపు భాస్కర్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై కౌంటరు దాఖలు చేయాలని సీబీఐని కోర్టు ఆదేశిస్తూ.. విచారణను ఈనెల 5కి వాయిదా వేసింది.