YS Viveka Murder Case: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు ప్రక్రియలో సీబీఐ కీలక నిర్ణయం తీసుకుంది. వివేకా రాసిన లేఖను నిన్‌హైడ్రేట్ పరీక్షకు అనుమతించాలని.. సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వివేకా రాసిన లేఖపై వేలిముద్రలను గుర్తించేందుకు ఇప్పటికే సీబీఐ కసరత్తు మొదలుపెట్టింది. హత్య జరిగిన చోట లభించిన లేఖను 2021 ఫిబ్రవరి 11న సీఎఫ్ఎస్ఎల్కు సీబీఐ పంపగా.. ఒత్తిడిలో వివేకా రాసిన లేఖగా ఇప్పటికే దిల్లీ సీఎఫ్ఎస్ఎల్ తేల్చింది. లేఖపై వేలిముద్రలు కూడా గుర్తించాలని సీఎఫ్ఎస్ఎల్ను సీబీఐ కోరింది. లేఖపై వేలిముద్రల గుర్తింపునకు నిన్‌హైడ్రేట్ పరీక్ష చేయాలన్న సీఎఫ్ఎస్ఎల్.. ఈ పరీక్ష ద్వారా లేఖపై ఉన్న రాత, ఇంకు దెబ్బతినే అవకాశముందని తెలిపింది. నిన్‌హైడ్రేట్ పరీక్షకు అనుమతివ్వాలని సీబీఐ కోర్టును ఆశ్రయించింది. లేఖపై ఉన్న వేలిముద్రలను అనుమానితుల వేలిముద్రలతో పోల్చాల్సి ఉందని సీబీఐ తెలిపింది. రికార్డుల్లో ఒరిజనల్ లేఖ బదులుగా కలర్ జిరాక్స్‌ను అనుమతించాలని సీబీఐ కోర్టును కోరింది. ఈ నేపథ్యంలో కోర్టు నిందితుల స్పందన కోరింది. సీబీఐ పిటిషన్‌పై తదుపరి విచారణ జూన్ 2న జరపనుంది.
YS Viveka Murder Case: వివేకా రాసిన లేఖపై నిన్‌హైడ్రేట్ పరీక్షకు అనుమతించాలని సీబీఐ పిటిషన్ - వేలిముద్రలు గుర్తించేందుకు పరీక్ష
ys viveka case
15:18 May 12
వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తు ప్రక్రియలో సీబీఐ కీలక నిర్ణయం
Last Updated : May 12, 2023, 4:38 PM IST