Niira Radia tape leak case : ప్రముఖ లాబీయిస్ట్ నీరా రాడియాకు కేంద్ర దర్యాప్తు సంస్థ క్లీన్ చిట్ ఇచ్చింది. నీరా రాడియా టేపుల వ్యవహారంపై ప్రాథమికంగా విచారణ చేపట్టగా.. అందులో 14 కేసులకు సంబంధించిన ఆధారాలు లభ్యం కాలేదని సుప్రీంకోర్టుకు సీబీఐ తెలిపింది. ఈ కేసును జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. తదుపరి విచారణను అక్టోబరు 12కు వాయిదా వేసింది.
లాబీయిస్ట్ నీరా రాడియా తన వైష్ణవి కార్పొరేట్ కమ్యూనికేషన్ సంస్థ ద్వారా ప్రముఖులతో ఫోన్ సంభాషణలు జరిపారు. అయితే.. పన్నులకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా ఆమె ఫోన్ సంభాషణలను 2008, 2009లో ట్యాప్‌చేసి.. రికార్డు చేశారు అధికారులు. ఇందులో ప్రముఖ వ్యాపారవేత్తలు, జర్నలిస్టులు, ఇతర ప్రముఖులు సైతం ఉన్నారు.