తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హైకోర్టు మాజీ జడ్జిపై అవినీతి ఆరోపణలు- సీబీఐ విచారణకు కేంద్రం ఓకే - ఎస్​ఎన్​ శుక్లా అవినీతి కేసులో సీబీఐ విచారణ

High Court judge corruption case: అలహాబాద్​ హైకోర్ట్​ విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్​ ఎస్​ఎన్​ శుక్లాను విచారించేందుకు సీబీఐకి కేంద్రం అనుమతించింది. ఓ ప్రైవేట్​ మెడికల్​ కళాశాలకు సంబంధించిన కేసులో జస్టిస్​ ఎస్​ఎన్​ శుక్లా (S N Shukla in corruption case) అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నట్లు అధికారులు తెలిపారు.

Allahabad High Court judge in corruption case
హైకోర్ట్​ న్యాయమూర్తి

By

Published : Nov 26, 2021, 5:41 PM IST

High Court judge corruption case: అలహాబాద్​ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్​ ఎస్​ఎన్​ శుక్లాను విచారించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కు కేంద్ర ప్రభుత్వం అనుమతించినట్లు అధికారులు తెలిపారు. ఓ ప్రైవేట్​ మెడికల్‌ కాలేజీకి సంబంధించిన కేసులో జస్టిస్ శుక్లా కాలేజీ యాజమాన్యానికి అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. అవినీతి నిరోధక చట్టం ప్రకారం ఈ విషయంపై ఆయన్ను విచారించేందుకు సీబీఐ ఏప్రిల్​ 16న కేంద్రం అనుమతి కోరుతూ లేఖ రాసింది. కేంద్రం ఇప్పుడు సానుకూలంగా స్పందించగా.. విశ్రాంత న్యాయమూర్తిపై (cbi case on high court judge) ఛార్జిషీట్​ దాఖలు చేసేందుకు సీబీఐ సిద్ధమైంది.

ఈ కేసులో జస్టిస్​ శుక్లా (S N Shukla in corruption case)తో పాటు ఛత్తీస్‌గఢ్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్​ ఐఎం ఖుద్దూసీ ప్రసాద్​ (high court judge in corruption case ), ఎడ్యుకేషనల్​ ట్రస్ట్​కు చెందిన భగవాన్​ ప్రసాద్​ యాదవ్​, పలాశ్​ యాదవ్​, ట్రస్ట్​, భావనా పాండే, సుధీర్​గిరిపై ఎఫ్​ఐఆర్​ నమోదు చేసినట్లు సీబీఐ అధికారులు పేర్కొన్నారు. నిందితులపై అవినీతి నిరోధక చట్టం ప్రకారం ఎఫ్​ఐఆర్​ను నమోదైనట్లు చెప్పారు. జస్టిస్​ శుక్లా నుంచి అనుకూలమైన తీర్పు పొందేందుకుగానూ.. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న ఓ వ్యక్తి ముడుపులు చెల్లించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో సీబీఐ లఖ్​నవూ, మేరఠ్, దిల్లీ సహా మిగతా ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది.

సౌకర్యాల లేమి కారణంగా ప్రసాద్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో విద్యార్థులు చేరకుండా కేంద్రం 2017 మేలో డిబార్ చేసిందని అధికారులు తెలిపారు. ఈ నిర్ణయాన్ని ట్రస్ట్ రిట్ పిటిషన్ ద్వారా సుప్రీంకోర్టులో సవాలు చేసిందని పేర్కొన్నారు. తరువాత దానిని ఉపసంహరించుకున్న ట్రస్ట్​... తిరిగి లఖ్​నవూ బెంచ్​లో రిట్​ పిటిషన్​ వేసింది. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్​ శుక్లా ట్రస్ట్​కు అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేశారని ఎఫ్​ఐఆర్​లో అధికారులు పేర్కొన్నారు.

ఇదీ చూడండి:న్యాయవ్యవస్థ రక్షణకు సహకరించండి: జస్టిస్ రమణ

ABOUT THE AUTHOR

...view details