తెలంగాణ

telangana

ETV Bharat / bharat

' టీ షర్ట్స్​ ధరించి వస్తే ఒప్పుకునేది లేదు'

సీబీఐ డైరెక్టర్​గా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన సుబోధ్‌ కుమార్‌ జైస్వాల్‌.. పరిపాలనాపరంగా పలు మార్పులకు శ్రీకారం చుట్టారు. అధికారులంతా విధిగా షేవ్​ చేసుకోవాలని సూచించిన ఆయన.. టీషర్ట్, జీన్స్‌, స్పోర్ట్‌ షూస్‌ ధరించి కార్యాలయానికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ మేరకు నూతన మార్గదర్శకాలను వెల్లడించారు.

cbi director subodh kumar jaiswal
సీబీఐ డైరెక్టర్‌ సుబోధ్‌ కుమార్‌ జైస్వాల్‌

By

Published : Jun 4, 2021, 10:30 PM IST

గతవారం సీబీఐ డైరెక్టర్‌గా నియమితులైన సుబోధ్‌ కుమార్‌ జైస్వాల్‌ పరిపాలనా విభాగంలో కొన్ని మార్పులకు పూనుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇకపై సీబీఐ అధికారులు, స్టాఫ్‌ సభ్యులు టీషర్ట్, జీన్స్‌, స్పోర్ట్‌ షూస్‌ ధరించి కార్యాలయానికి వస్తే సహించేది లేదు. కచ్చితంగా ఫార్మల్‌ దుస్తులు, బూట్లు ధరించే హాజరు కావాలి అని తెలిపారు.

అంతేకాదు.. గెడ్డం ఉండకుండా క్లీన్‌షేవ్‌ చేసుకుని రావాలి. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సీబీఐ కార్యాలయాలు, శాఖలకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. గతంలో ఎలాంటి డ్రెస్‌కోడ్‌ లేకపోవడంతో టీషర్ట్, జీన్స్‌ ధరించేవారు. దీన్ని ఎవరూ ఆపలేదు. ఇకపై సూచించిన విధంగా తప్పక పాటించాలి అని మార్గదర్శకాలను వివరించారు.

గతవారమే ఆయన సీబీఐ 33వ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ప్రధాని మోదీ, సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత అధీర్‌ రంజన్‌ చౌధరితో కూడిన కమిటీ సుభోధ్‌ కుమార్‌ను ఈ పదవికి ఎంపిక చేసింది. 1985 మహారాష్ట్ర క్యాడర్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి సుబోధ్‌కుమార్‌ రెండేళ్ల పాటు ఈ పదవిలో ఉండనున్నారు.

ఇవీ చదవండి:సీబీఐ డైరెక్టర్‌గా సుబోధ్‌ కుమార్ జైశ్వాల్‌

ABOUT THE AUTHOR

...view details