CBI Custody : వివేకా హత్య కేసులో నిందితులను కస్టడీకి ఇవ్వాలన్న సీబీఐ అభ్యర్థనకు కోర్టు అనుమతించింది. వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డి, ఉదయ కుమార్‌రెడ్డిని ఆరు రోజుల కస్టడీకి అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు బుధవారం నుంచి ఆరు రోజులపాటు ఇద్దరినీ సీబీఐ అధికారులు ప్రశ్నించనున్నారు. కాగా, అవినాష్ రెడ్డిని సైతం వారితో కలిపి విచారిస్తామని సీబీఐ వెల్లడించింది. అయితే, ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు విచారించాలని, ఆ తర్వాత చెంచల్‌గూడ జైలులో అప్పగించాల్సిందిగా సీబీఐ అధికారులకు కోర్టు స్పష్టం చేసింది.
Viveka murder case : 6 రోజుల సీబీఐ కస్టడీకి భాస్కర్ రెడ్డి, ఉదయకుమార్ రెడ్డి - Viveka murder case
16:30 April 18
భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డితో కలిపి అవినాష్‌ను విచారిస్తాం.. : సీబీఐ
కడప మాజీ ఎంపీ వివేకానందా రెడ్డి హత్య కేసులో సీబీఐ సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. అందులో భాగంగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి ప్రధాన అనుచరుడు ఉదయ్ కుమార్ రెడ్డిని నాలుగు రోజుల క్రితం అరెస్టు చేసింది. తాజాగా ఈ నెల 16న అవినాష్ రెడ్డి తండ్రిని వైఎస్ భాస్కర్ రెడ్డిని కూడా సీబీఐ అరెస్టు చేసి చెంచల్‌గూడ జైలుకు తరలించింది. అంతకు ముందు.. ఆదివారం ఉదయం పులివెందులలోని అవినాష్ రెడ్డి నివాసానికి రెండు వాహనాల్లో చేరుకున్న సీబీఐ అధికారులు... భాస్కర్‌రెడ్డి అరెస్టు మెమోను కుటుంబసభ్యులకు అందించారు.
అరెస్టు సమయంలో భాస్కర్ రెడ్డి అనుచరులు భారీగా చేరుకున్నారు. భాస్కర్ రెడ్డిని కడపకు తీసుకెళ్తున్న సమయంలో వాహనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. వారి నుంచి తప్పించిన అధికారులు.. భాస్కర్ రెడ్డిని కడపకు తరలించి... అక్కడి నుంచి తిరిగి హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. సీబీఐ జడ్జి ముందు హాజరుపరచగా రిమాండ్ విధించడంతో చెంచల్‌గూడ జైలుకు తరలించారు. వివేకానందరెడ్డి హత్యకేసులో భాస్కర్‌రెడ్డి ప్రధాన సూత్రధారి అనే ఆరోపణలున్నాయి.
వివేకానంద రెడ్డి హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి కుట్ర దారుడని సీబీఐ భావిస్తోంది. 2019 మార్చి 15న హత్య జరగ్గా... తొలుత గుండెపోటుతో మృతిచెందాడనే ప్రచారం జరిగింది. దీని వెనుక భాస్కర్ రెడ్డే కీలక సూత్రధారి అనే ఆరోపణలు వచ్చాయి. ప్రచారంతో పాటు.. సాక్ష్యాధారాలు చెరిపేయడంలో భాస్కర్ రెడ్డిది పాత్ర కీలకమని సీబీఐ పేర్కొంది. హత్యకు ముందు సునీల్ యాదవ్.. భాస్కర్ రెడ్డి ఇంట్లో ఉన్నట్లుగా గూగుల్ టేకౌట్ ఆధారాలను సేకరించినట్లు సీబీఐ పేర్కొంది. అంతేకాకుండా.. దస్తగిరి కదిరికి వెళ్లి గొడ్డలి తెచ్చే వరకు భాస్కర్ రెడ్డి ఇంట్లోనే సునీల్ యాదవ్ వేచి ఉన్నాడని, ఆ సమయంలో భాస్కర్ రెడ్డి తన రెండు ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసుకున్నారని సీబీఐ పేర్కొంది.
ఇవీ చదవండి: