CBI Counter on MP Avinash: వైఎస్సార్ జిల్లా రాజకీయాల్లో వివేకా చురుకైన పాత్ర పోషిస్తుండటంతో.. ఎంపీ అనినాష్‌రెడ్డి, అతని తండ్రి భాస్కరరెడ్డి, శివశంకరరెడ్డి.. రాజకీయ విభేదాలతో కక్ష పెంచుకుని ఆయనకు వ్యతిరేకంగా కుట్ర పన్నడం ప్రారంభించారని తెలంగాణ హైకోర్టుకు సీబీఐ నివేదించింది. 2017 MLC ఎన్నికల్లో గెలవకపోవడం.. పులివెందుల డివిజన్ మినహా మిగిలి ప్రాంతాల్లో గెలవడం... వైసీపీ శ్రేణులకు ఆశ్చర్యం కలిగించిందన్న విషయం.. పలువురు సాక్షుల వాంగ్మూలం ప్రకారం తెలిసిందని.. కోర్టుకు వెల్లడించింది. ఎలాగైనా గెలుస్తానన్న ధీమాతో వివేకా తన డివిజన్‌ను వదిలి ఇతర డివిజన్లపై దృష్టి సారించారని పేర్కొంది.
పులివెందుల వ్యవహారాలను అవినాష్‌రెడ్డి, భాస్కరరెడ్డి, శివశంకరరెడ్డి చూశారని తెలిపింది. శివశంకరరెడ్డి MLC స్థానానికి పోటీ చేయాలని చూడగా.. అవినాష్‌రెడ్డి, భాస్కరరెడ్డి కూడా ఆయన టికెట్ కోసం ప్రయత్నం చేశారని తెలంగాణ హైకోర్టుకు సీబీఐ తెలిపింది. వివేకాకు జగన్ టికెట్ ఇవ్వడంతో వీరు కక్ష పెంచుకుని ఓడించారని.. వెన్నుపోటుతో ఓడిపోయినట్లు తెలుసుకుని వీరిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారని వివరించింది. అప్పటి నుంచి గంగిరెడ్డిని నమ్మకపోవడంతో పాటు పలుమార్లు వివేకా తిట్టిన సందర్భాలున్నాయని పేర్కొంది. ఇదే సమయంలో గంగిరెడ్డి.. అవినాష్‌రెడ్డి, భాస్కరరెడ్డి, శివశంకరరెడ్డితో సత్సంబంధాలు పెంచుకున్నారని తెలిపింది.
ఈ నేపథ్యంలో ఎంపీ టికెట్‌ను షర్మిల, లేదా విజయమ్మకు ఇవ్వాలని.. అవినాష్‌రెడ్డికి ఎంపీ టికెట్ కాకుండా.. జమ్మలమడుగు MLA టికెట్ ఇవ్వాలని చెప్పడంతో పాటు.. కడప లోక్‌సభ స్థానం నుంచి పోటీకి షర్మిలను వివేకా ఒప్పించారని.. సీబీఐ వివరించింది. వివేకా రాజకీయ ఎత్తుగడలను ఊహించిన ఆ ముగ్గురు.. ఆయనపై అసంతృప్తిగా ఉన్నారని.. తెలంగాణ హైకోర్టుకు సీబీఐ తెలిపింది. దీంతో.. నేరచరిత్ర ఉన్న శివశంకరరెడ్డి ద్వారా హత్యకు కుట్ర పన్నినట్లు.. ప్రాసంగిక సాక్ష్యాలు వెల్లడిస్తున్నాయని వివరించింది. హత్యకు నెల ముందు నుంచే భారీ మొత్తాన్ని ఆశ చూపినట్లు.. దర్యాప్తులో వెల్లడైందని పేర్కొంది. దస్తగిరి వాంగ్మూలం ప్రకారం 40 కోట్ల రూపాయలు ఇస్తానని శివశంకరరెడ్డి హామీ ఇచ్చారని.. సీబీఐ తెలిపింది.
2019 మార్చి 14, 15న వివేకా హత్య, సాక్ష్యాల ధ్వంసం జరిగిన తర్వాత.. మార్చి 17న అవినాష్‌రెడ్డి ఎంపీ అభ్యర్థిగా ప్రకటన జరిగిన నేపథ్యంలో.. కుట్ర జరిగినట్లు తెలుస్తోందని.. తెలంగాణ హైకోర్టుకు సీబీఐ నివేదించింది. హత్య ముందు రోజు.. మైదుకూరు ప్రచారంలో వివేకాతో ఉన్న గంగిరెడ్డి రెండు సార్లు.. యాదాటి సునీల్ యాదవ్‌కు ఫోన్ చేశారని పేర్కొంది. గూగుల్ టేక్‌ఔట్ ప్రకారం సునీల్‌యాదవ్.. ఈ సమయంలో 6 గంటల 15 నిమిషాల నుంచి 6.33 మధ్య అవినాష్‌రెడ్డి వాళ్ల ఇంట్లో ఉంటూ గొడ్డలి తీసుకురావడానికి కదిరి వెళ్లిన దస్తగిరి కోసం ఎదురుచూస్తున్నాడని.. తెలిపింది.
సునీల్‌యాదవ్ ఫోన్ మెసేజ్‌ల ద్వారా దస్తగిరినీ సంప్రదించారని పేర్కొంది. ఈ మధ్యలో ఉదయ్‌కుమార్‌రెడ్డి... అవినాష్‌రెడ్డి ఇంటికి 6 గంటల 53నిమిషాలకు వచ్చి... 8 గంటల 7 నిమిషాల వరకు ఉన్నారని వివరించింది. శివశంకరరెడ్డి కూడా 7.15కు పులివెందుల చేరుకుని.. జమ్మలమడుగులో వివేకాతో ఉన్న గంగిరెడ్డికి 7.58కి ఫోన్ చేశారని వెల్లడించింది. హత్యకు ముందు, తర్వాత.. ఎక్కువ సమయం అవినాష్‌రెడ్డి, శివశంకరరెడ్డి.. ఒకే టవర్ పరిధిలో ఉన్నారని... సీబీఐ తెలిపింది.
దస్తగిరి 8 గంటల 39నిమిషాలకి పులివెందుల చేరుకుని.. సునీల్‌యాదవ్‌ను కలవగా... భాస్కరరెడ్డి... తన రెండు ఫోన్‌లను స్విచాఫ్ చేశారని పేర్కొంది. మార్చి 14న 8 గంటల 21 నిమిషాలకు చివరి కాల్ చేశాక... తిరిగి 16న 9 గంటల 40నిమిషాలకు కాల్ చేశారని వెల్లడించింది. మరో ఫోన్‌లో మార్చి 14న రాత్రి 8 గంటల13నిమిషాలకు కాల్ చేసి.. తర్వాత 15న 7 గంటల 35నిమిషాలకు కాల్ చేశారని.. మధ్యలో ఎలాంటి కాల్స్ లేవని.. CBI వివరించింది. 14, 15 తేదీల్లో అవినాష్, భాస్కరరెడ్డి ఇళ్లకు సునీల్‌యాదవ్ పలుమార్లు వెళుతూనే ఉన్నారని.. గూగుల్ టేక్‌ఔట్ ఆధారంగా.. గంటలు, నిమిషాలు సహా.. CFSL నివేదిక వెల్లడించిందని.. సీబీఐ పేర్కొంది.