CBI Corona News: ఒమిక్రాన్ ప్రభావంతో దేశంలో కరోనా మహమ్మారి శరవేగంగా విస్తరిస్తోంది. అధికారులు, వైద్య సిబ్బంది కూడా ఇందుకు మినహాయింపు కాదు. జాగ్రత్తలు పాటిస్తున్నా వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా ముంబయిలోని సీబీఐ కార్యాలయంలో 68 మందికి పాజిటివ్ అని నిర్ధరణ అయింది.
సీబీఐ కార్యాలయంలో 68 మందికి కరోనా - దేశంలో కరోనా వైరస్
CBI Corona News: ముంబయిలోని సీబీఐ కార్యాలయంలో కరోనా కలకలం రేపింది. మొత్తం 235 మంది సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 68 మందికి పాజిటివ్ అని తేలింది.
సీబీఐ కార్యాలయంలో 68 మందికి కరోనా
బాంద్రా- కుర్లా కాంప్లెక్స్‌లోని కార్యాలయంలో మొత్తం 235 మంది సిబ్బందికి పరీక్షలు నిర్వహించగా 68 మందికి పాజిటివ్ వచ్చింది. వైరస్ బారిన పడినవారు హోం క్వారంటైన్లో ఉంటారని అధికారులు వెల్లడించారు.
ఇదీ చూడండి :'రైళ్లలో ప్రయాణించాలంటే.. ఆ సర్టిఫికెట్ తప్పనిసరి'
Last Updated : Jan 8, 2022, 5:41 PM IST