ఐఐటీ-జేఈఈ మెయిన్స్ పరీక్షల్లో(IIT-JEE mains examination) అవకతవకల ఆరోపణలతో ఎఫినిటీ ఎడ్యుకేషన్ ప్రైవేటు లిమిటెడ్, దాని డైరెక్టర్లపై కేసు నమోదు చేసింది కేంద్ర దర్యాప్తు సంస్థ. కేసులో భాగంగా గురువారం దేశవ్యాప్తంగా 20 కేంద్రాల్లో సోదాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. దిల్లీ, పుణె, జంషెడ్‌పుర్ సహా పలు నగరాల్లో ఈ తనిఖీలు జరిగినట్లు చెప్పారు.
జేఈఈ పరీక్షల్లో అవకతవకలు.. సీబీఐ సోదాలు - జేఈఈ
జేఈఈ మెయిన్స్ పరీక్షల్లో(IIT-JEE mains examination) అవకతవకల కేసుకు సంబంధించి దేశవ్యాప్తంగా 20 ప్రాంతాల్లో సోదాలు చేపట్టింది సీబీఐ. ఎఫినిటీ ఎడ్యుకేషన్, దాని డైరెక్టర్లపై కేసు నమోదు చేసింది.
జేఈఈ మెయిన్స్ పరీక్ష
ఇన్స్టిట్యూట్, దాని డెరైక్టర్లతో పాటు భాగస్వాములు, పరీక్షా కేంద్రాల్లో నియమించిన సిబ్బంది సహా మరికొంత మందిని ఈ కేసులో చేర్చినట్లు సీబీఐ ప్రతినిధి ఆర్సీ జోసీ తెలిపారు. 2021, సెప్టెంబర్ 1న కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
ఇదీ చూడండి:జేఈఈ, నీట్ ర్యాంకుల కేటాయింపులో కీలక మార్పు
Last Updated : Sep 2, 2021, 7:28 PM IST