తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'సీబీఐ ఇప్పుడు పంజరంలో చిలుక కాదు' - కేంద్ర న్యాయశాఖ మంత్రి

kiran rijiju cbi caged parrot: దేశ అత్తున్నత దర్యాప్తు సంస్థగా సీబీఐ తన విధులను పకడ్బందీగా నిర్వర్తిస్తోందని, ఇప్పుడు 'పంజరంలో చిలుక' కాదని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు ఉద్ఘాటించారు. దిల్లీలో జరుగుతోన్న సీబీఐ అధికారుల సమావేశంలో ప్రసంగించారు.

CBI
కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు

By

Published : Apr 3, 2022, 9:43 PM IST

kiran rijiju cbi caged parrot: సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ) ఇప్పుడు 'పంజరంలో చిలుక' కాదని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు ఉద్ఘాటించారు. అయితే, గతంలో ప్రభుత్వంలో ఉన్న కొందరు కొన్నిసార్లు సీబీఐ దర్యాప్తులో సమస్యలు సృష్టించేవారన్నారు. కానీ, ప్రస్తుతం దేశ అత్తున్నత దర్యాప్తు సంస్థగా సీబీఐ తన విధులను పకడ్బందీగా నిర్వర్తిస్తోందని అన్నారు. దిల్లీలో జరుగుతోన్న సీబీఐ అధికారుల సమావేశంలో ప్రసంగించిన ఆయన.. గతంలో కొంతమంది సీబీఐ అధికారులు ఎదుర్కొన్న సవాళ్లు కూడా ప్రస్తుతం లేవని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.

"అధికారంలో ఉన్న వ్యక్తులు అవినీతికి పాల్పడితే ఎదురయ్యే ఇబ్బందుల గురించి నాకు అవగాహన ఉంది. వారిని ఇబ్బందుల నుంచి గట్టేక్కించేందుకు వారికి అనుగుణంగా నడుచుకుంటే సీబీఐ కష్టాల్లో పడినట్లే. ఆ క్రమంలో గతంలో న్యాయవ్యవస్థ నుంచి కొన్ని అవాంఛనీయ వ్యాఖ్యలు కూడా విన్నాం. కానీ, ప్రస్తుతం అటువంటి వాటికి ఎంతో దూరంగా ఉన్నాం"

- కిరణ్‌ రిజుజు, కేంద్ర న్యాయశాఖ మంత్రి.

ఒకప్పుడు ప్రభుత్వంలో ఉన్న కొందరు సీబీఐ దర్యాప్తులో సమస్యలు సృష్టించేవారన్న ఆయన.. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసే కీలక వ్యక్తే ప్రస్తుతం ప్రధానమంత్రిగా ఉన్నారని అన్నారు. 2013లో బొగ్గు గనుల కేటాయింపునకు సంబంధించిన కేసు విచారణ సందర్భంగా.. సీబీఐ 'పంజరంలో చిలుక'గా మారిందని భారత అత్యున్నత న్యాయస్థానం అభివర్ణించిన విషయాన్ని కేంద్రమంత్రి పరోక్షంగా ప్రస్తావించారు.

ఇదీ చూడండి:'ప్రజాస్వామ్యంపై ఆధిపత్యం చలాయించాలని చూడొద్దు'

ABOUT THE AUTHOR

...view details