తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వీసా కుంభకోణం కేసులో చిదంబరం సన్నిహితుడు అరెస్ట్​ - visa scam

Karti chidambaram CBI: కేంద్ర మాజీ హోంమంత్రి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరంపై మంగళవారం నమోదైన కేసుకు సంబంధించి ఆయన సన్నిహితుడిని అరెస్ట్​ చేసింది సీబీఐ. భాస్కర రామన్​గా పేర్కొనే ఇతను చైనీయులకు, కార్తీకి మధ్యవర్తిత్వం చేశాడని సీబీఐ ఆరోపించింది.

d
d

By

Published : May 18, 2022, 10:17 AM IST

Karti chidambaram CBI: వీసా కుంభకోణం కేసులో మాజీ హోంమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం నివాసం, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన సీబీఐ.. తాజాగా ఆయన సన్నిహితుడైన ఎస్​. భాస్కర రామన్​ను అరెస్ట్​ చేసింది. మంగళవారం రాత్రి భాస్కర రామన్​ను విచారించిన అధికారులు.. బుధవారం తెల్లవారుజామున అతడిని అరెస్ట్ చేశారు. చైనీయుల వీసాల కోసం టాల్​వండీ సాబో పవర్​ లిమిటెడ్​కు చెందిన అసోసియేట్​ వైస్​ ప్రెసిడెంట్ వికాస్​ మఖారియా.. భాస్కర రామన్​ ద్వారానే కార్తీ చిదంబరంను సంప్రదించినట్లు వెల్లడించారు.

"ఓ కంపెనీ తరఫున వీసాల జారీకి ఉన్న పరిమితులకు అడ్డు రాకుండా ఉండేలా చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో సంబంధిత చైనా సంస్థలోని 263 ప్రాజెక్ట్​ వీసాలను గడువు ముగిసినా మళ్లీ ఉపయోగించుకునేలా చేశారు. సాధారణంగా వీసాను పునర్వినియోగించుకోవాలంటే హోంమంత్రి అనుమతి కావాల్సి ఉంటుంది. అప్పటి హోంమంత్రి వీటిని అనుమతించినట్లు తెలుస్తోంది. 2011 ఆగస్టు 17న భాస్కర రామన్​ సూచనల మేరకు మఖారియా జూలై 30 తేదీతో ఓ ఈమెయిల్​ను అతనికి పంపించారు. ఇది కార్తీకి కూడా ఫార్వాడ్​ చేశాడు భాస్కర రామన్. ఆ తర్వాత అప్పటి హోంమంత్రి చిదంబరంతో చర్చించి రూ.50 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు."

-సీబీఐ అధికారులు

మంగళవారం.. 2010-14 మధ్య కాలంలో లావాదేవీలు, విదేశీ డబ్బు పంపిన ఆరోపణలకు సంబంధించి కార్తీపై కొత్త కేసు నమోదు చేసిన సీబీఐ ముంబయి, దిల్లీ తమిళనాడు సహా పలు ప్రాంతాలు కలిపి మొత్తం 9 ప్రదేశాల్లో సోదాలు నిర్వహించింది. చెన్నైలో 3, కర్ణాటకలో 1, ముంబయిలో 3, పంజాబ్​లో 1, ఒడిశాలో 1 ప్రదేశాల్లో సోదాలు జరిపింది.

ఇదీ చూడండి :'టెలిఫోన్‌ తీగ ద్వారా '11 కేవీ విద్యుత్తు' సరఫరానా..?'

ABOUT THE AUTHOR

...view details