బ్యాంకు రుణాల మోసం కేసులో లంచం తీసుకున్నారన్న ఆరోపణలతో సొంత విభాగం డీఎస్పీ ఆర్ కే రిషి, ఇన్స్పెక్టర్ కపిల్ ధంకడ్‌తో పాటు కేసుకు సంబంధం ఉన్న ఓ న్యాయవాదిని అరెస్ట్ చేసింది కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ). ఉత్తర్‌ప్రదేశ్ సహరన్‌పుర్ జిల్లాలోని డీఎస్పీ రిషి ఇంట్లో సోదాలు నిర్వహించి, ఈ మేరకు చర్యలు చేపట్టింది.
లంచం కేసులో సొంత డీఎస్పీని అరెస్ట్ చేసిన సీబీఐ - సీబీఐ అరెస్టులు
ఓ కేసు విచారణలో లంచం తీసుకున్నారన్న ఆరోపణల నేపథ్యంలో సొంత విభాగంలోని డీఎస్పీ, ఇన్స్పెక్టర్ సహా పలువురిని అరెస్ట్ చేసింది సీబీఐ.
లంచం కేసులో సీబీఐ డీఎస్పీ అరెస్ట్
రూ. 4,300 కోట్ల బ్యాంకు రుణాల మోసానికి సంబంధించిన కేసులో కొన్ని సంస్థలకు సాయం చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు పలువురు అధికారులు. లంచాలు తీసుకొని కేసు విచారణలో రాజీ పడినట్లు అనుమానంతో డీఎస్పీ రిషి, ధంకడ్, న్యాయవాది మనోహర్ మాలిక్‌తో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసింది సీబీఐ.
ఇదీ చూడండి:రూ.కోటి లంచం కేసులో రైల్వే అధికారి అరెస్టు
Last Updated : Jan 20, 2021, 4:57 PM IST