కర్ణాటక మండ్యాలోని కృష్ట రాజ సాగర్ డ్యాం జలాల్లో 36 కిలోల కాట్ల చేప బయటపడింది. మత్స్యకారుడు నంజుడన్న వేసిన వలలో ఈ భారీ చేప పడింది. ఇంత పెద్ద చేప వలలో పడడం తన చిన్నతనం నుంచి ఇదే తొలిసారి అని మత్స్యకారుడు తెలిపాడు.
సాధారణంగా ఇలాంటి చేపలను పట్టడానికి తంగస్ అనే పెద్ద వలలను ఉపయోగిస్తారని నంజుడన్న చెప్పారు. వాటి ధర సుమారు రూ. 50 వేల వరకూ ఉంటుందని పేర్కొన్నారు. డ్యాంలో ఇంతకు మించిన పెద్ద చేపలు కూడా ఉన్నాయని తెలిపిన ఆయన.. వాటి వేటకు తమ దగ్గర ఉండే రూ.20వేల వలలు సరిపోవన్నారు.