పంజాబ్ కొత్త ముఖ్యమంత్రిగా (Punjab CM news) సోమవారం ప్రమాణస్వీకారం చేశారు చరణ్‌జీత్ సింగ్ చన్నీ (Charanjit Singh Channi Cast). అయితే ఇదిప్పుడు రాజకీయాల్లో సంచలనంగా మారింది. కారణం.. ఆయన దళితుడు కావడం. దేశంలో ప్రస్తుతం ఉన్న ఏకైక దళిత సీఎం చన్నీనే (Dalit CM in India). ఇంకా.. పంజాబ్‌కు కూడా ఆయనే తొలి దళిత ముఖ్యమంత్రి. ఇది పంజాబ్‌కు మాత్రమే పరిమితం కాలేదు. దేశ రాజకీయాల్లోనూ హాట్‌టాపిక్‌గా మారింది.
చన్నీ నియామకంతో.. 2022 అసెంబ్లీ ఎన్నికలకు ముందు (Assembly Election 2022) మరోసారి కుల రాజకీయాలు (Caste Politics) తెరమీదకు వచ్చాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో ఎస్సీ వర్గానికి చెందిన ఓ వ్యక్తిని కాంగ్రెస్.. ముఖ్యమంత్రిని చేయడం ఇదే తొలిసారి. ఈ నిర్ణయంతో.. ఇతర రాష్ట్రాల్లోనూ ఈ సూత్రం అమలయ్యేందుకు బాటలు పడ్డాయని, ఇది స్వాగతించదగ్గ పరిణామమని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
అయితే.. చన్నీ ఎంపికను (Channi Caste in Punjab) ప్రతిపక్షాలు, ఇతర పార్టీలు స్వాగతిస్తూనే.. కాంగ్రెస్‌ను తూర్పారపట్టాయి.
ఎన్నికల గిమ్మిక్కే..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతి (Mayawati news), సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్ అఖిలేశ్ యాదవ్, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత భగవంత్ మన్ సహా పలువురు చన్నీ నియామకంపై ప్రశంసలు కురిపించారు. మరోవైపు.. దళితుల ఓట్లను చేజిక్కించుకునే ఉద్దేశంతోనే (Assembly Election 2022) చన్నీకి కాంగ్రెస్ అవకాశం కల్పించిందని విమర్శించాయి భాజపా, బీఎస్పీ.
చన్నీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. కాంగ్రెస్‌కు (Punjab Congress news) తొలి సవాల్ ఆ పార్టీ నుంచే వచ్చింది. నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఆధ్వర్యంలోనే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తుందని, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి హరీశ్ రావత్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
''చరణజీత్ చన్నీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజే.. 'సిద్ధూ ఆధ్వర్యంలో ఎన్నికలకు వెళ్తాం' అని హరీశ్ రావత్ చేసిన ప్రకటన గందరగోళానికి గురిచేస్తోంది. ఇది సీఎం అధికారాన్ని తగ్గించడం, ముఖ్యమంత్రి పీఠాన్ని అవమానించడమే.''
- సునీల్ జాఖడ్, పంజాబ్ పీసీసీ మాజీ చీఫ్
దళిత సీఎం.. నైట్ వాచ్మెన్..!
ఇదే తరుణంలో.. కాంగ్రెస్‌పై మాటల దాడిని పెంచింది భాజపా. ప్రస్తుత దళిత సీఎం పోస్టును నైట్ వాచ్‌మెన్‌తో పోల్చింది.
''గాంధీ కుటుంబ విధేయుడైన నవజ్యోత్ సింగ్ సిద్ధూ బాధ్యతలు స్వీకరించేవరకు .. దళిత సీఎంగా నైట్ వాచ్మెన్ పదవిలో ఉంటారు.''
- అమిత్ మాలవీయ, భాజపా ఐటీ విభాగం అధిపతి
కాంగ్రెస్, భాజపా స్వార్థపూరిత రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు బీఎస్పీ అధినేత్రి (BSP news) మాయావతి.
''పంజాబ్, ఉత్తర్‌ప్రదేశ్, ఇంకే రాష్ట్రమైనా కావొచ్చు.. దళితులు, ఓబీసీల పేర్లు చెప్పుకొని కాంగ్రెస్, భాజపా కుల రాజకీయాలు చేస్తున్నాయి. ఇప్పుడు.. దళిత వర్గానికి చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రిగా ప్రకటించడం.. ఎన్నికల స్టంట్ అనే చెప్పొచ్చు. పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు దళిత నేత ఆధ్వర్యంలో జరగబోవని నేను మీడియా ద్వారా తెలుసుకున్నా.''
- మాయావతి, బీఎస్పీ అధినేత్రి
దేశంలో ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేసిన తొలి దళిత ముఖ్యమంత్రి (Dalit CM in India) మాయావతి కావడం గమనార్హం.