తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఓటేసి ప్రజాస్వామ్యాన్ని బలపరచండి' - ప్రియాంక గాంధీ

ప్రజాస్వామ్యం బలోపేతం కోసం.. విభజన శక్తులకు వ్యతిరేకంగా భారీ సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకోవాలని అసోం, బంగాల్​ ప్రజల్ని కోరారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ. శనివారం అసోం, బంగాల్​లో తొలిదశ పోలింగ్​ నేపథ్యంలో రాహుల్​ ఈ మేరకు పిలుపునిచ్చారు.

Congress leader Rahul Gandhi
కాంగ్రెస్​ నేత రాహుల్​గాంధీ

By

Published : Mar 27, 2021, 12:34 PM IST

విభజన శక్తులకు వ్యతిరేకంగా.. ప్రజాస్వామ్యం బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని కాంగ్రెస్​ నేత రాహుల్​గాంధీ అసోం, బంగాల్​ ప్రజలకు పిలుపునిచ్చారు. అసోంలో 47, బంగాల్​లో 30 అసెంబ్లీ స్థానాలకు శనివారం(మార్చి27) తొలిదశ పోలింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా ఆయన ఈ ట్విట్టర్​ వేదికగా పిలుపునిచ్చారు.

పెద్ద ఎత్తున ఓటర్లు, ముఖ్యంగా మహిళలు ఓటు హక్కును వినియోంచుకోవాలని కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా అసోం ప్రజల్ని కోరారు.

ఇదీ చదవండి:'కాంగ్రెస్​ అంటేనే అబద్ధాలు, అస్థిరత, అవినీతి'

వామపక్షాలు, ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్) లతో కూటమిగా బెంగాల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ పడుతోంది. 294 అసెంబ్లీ స్థానాలున్న బంగాల్​లో ఎనిమిది విడతల్లో ఎన్నికలు జరుగనున్నాయి. చివరి దశ పోలింగ్​ ఏప్రిల్ 29న జరగనుంది.

అసోంలో మూడు దఫాలుగా ఎన్నికలు జరుగనున్నాయి. అసోంలో అధికారంలో ఉన్న భాజపాను ఓడించాలని కాంగ్రెస్ నేతృత్వంలోని "మహాజోత్" కూటమి ప్రయత్నిస్తోంది.

ఇదీ చదవండి:'భాజపాతో అభివృద్ధి- కాంగ్రెస్​తో చొరబాట్లు'

ABOUT THE AUTHOR

...view details