Case On Bigg Boss Winner :ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్, బిగ్‌బాస్ ఓటీటీ (హిందీ) సీజన్-2 విజేత ఎల్విశ్ యాదవ్‌పై ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు. పాము విషంతో రేవ్‌పార్టీ నిర్వహిస్తున్నాడన్న ఆరోపణలతో అతడి పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. పరారీలో ఉన్న అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అసలేం జరిగిందంటే?
ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడా.. సెక్టార్ 49లో జరుగుతున్న ఓ రేవ్‌పార్టీపై పోలీసులు గురువారం రాత్రి దాడి చేశారు. ఈ సందర్భంగా ఐదుగురు వ్యక్తులపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. వారి నుంచి ఐదు తాచు పాములు, ఒక కొండ చిలువ, రెండుతలల పాము, ర్యాట్ స్నేక్‌ను స్వాధీనం చేసుకున్నాడు. వీటితోపాటు పార్టీలో 20 మిల్లీలీటర్ల పాము విషాన్ని కూడా గుర్తించి సీజ్ చేశారు.
పోలీసులు స్వాధీనం చేసుకున్న పాములు
అయితే అరెస్టు చేసిన వారిని పోలీసులు ప్రశ్నించగా.. ఎల్విశ్ యాదవ్ పేరు బయటకు వచ్చింది. ఎల్విశ్ నిర్వహించే పార్టీలకు తరచూ పాములను సరఫరా చేస్తుంటామని వారు వెల్లడించారు. ఇందుకోసం భారీ మొత్తంలో డబ్బు తీసుకుంటామని అంగీకరించారు. దీంతో ఎల్విశ్ పేరును కూడా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. ఎల్విశ్ ఒక పామును చేత్తో పట్టుకొని అడుతున్న వీడియో బయటకు రావడం వల్ల అతడిపై కేసు పెట్టినట్లు పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసిన విషయం బయటకు రాగానే ఎల్విశ్ పరారైనట్లు తెలిపారు. అతడి కోసం వెతుకుతున్నట్లు వెల్లడించారు.
'గ్రేడ్-1 నేరం.. ఏడేళ్ల జైలు శిక్ష..'
మరోవైపు, ఈ కేసులో ఎల్విశ్ యాదవ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని బీజేపీ ఎంపీ, పీపుల్ ఫర్ యానిమల్స్ (పీఎఫ్‌ఏ) వ్యవస్థాపకురాలు మేనకా గాంధీ డిమాండ్ చేశారు. "ఎల్విశ్‌ను తక్షణమే అరెస్ట్ చేయాలి. అతడు చేసింది గ్రేడ్-1 నేరం.. అంటే ఏడేళ్ల జైలు శిక్ష. అతడు తన వీడియోల్లో అంతరించిపోతున్న పాములను చూపిస్తున్నాడు. నోయిడా సహా పలు ప్రాంతాల్లో పాము విషాన్ని విక్రయిస్తున్నాడు" అని మేనకా గాంధీ ఆరోపించారు.
'మహిళలను దూషిస్తుంటాడు'
ఎల్విశ్ యాదవ్ కేసుపై దిల్లీ మహిళా కమిషన్ ఛైర్మన్ స్వాతీ మాలీవాల్ స్పందించారు. ఎల్విశ్తో కలిసి హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ దిగిన ఫొటోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. "ఎల్విశ్పై ఎఫ్‌ఐఆర్ నమోదైందని ఇప్పుడే తెలిసింది. అతడు రేవ్‌పార్టీలు నిర్వహిస్తుంటాడని, పాము విషం మత్తు వాటిల్లో వాడతారని పోలీసులు ఆరోపించారు. ఇలాంటి వ్యక్తిని సీఎం వేదికపై ప్రమోట్ చేశారు. మరోవైపు ఆయన ప్రభుత్వం సాక్షిమాలిక్, బజరంగ్ పునియా వంటి ప్రతిభావంతులను కర్రలతో కొడుతుంది. ఇక ఇతడు (ఎల్విశ్) వీడియోల్లో మహిళలను దూషిస్తుంటాడు" అని ఆరోపణలు చేశారు.
Bigg Boss Contestant Varthur Santhosh Arrested : బిగ్‌బాస్ హౌస్‌లోకి ఫారెస్ట్ ఆఫీసర్స్.. కంటెస్టెంట్ అరెస్ట్.. ఇదే కారణం
ప్రముఖ యూట్యూబర్లపై ఐటీ దాడులు.. రూ.25కోట్ల పన్ను ఎగవేత.. తలుపులు బద్దలుకొట్టి అరెస్ట్!